BJP
హైదరాబాద్: తాను బీజేపీలో నుంచి వెళ్లిపోవాలని పార్టీలోనే కొంతమంది కోరుకుంటున్నారని, వారెవరో అందరికీ తెలుసు అన్నారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు.
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని అన్నారు. హైకమాండ్ పిలవకుండా ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదన్న రాజేందర్ వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు.
BRS తనను బయటకు వెళ్లగొడితే.. బీజేపీ అక్కున చేర్చుకుందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులాగా బలపడుతోందని, 9 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు.