బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం: మంత్రి హరీశ్‌రావు
విధాత: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు వస్తే చాలు, ఈడీలు, ఐటీలు దాడులు చేస్తారు. బీజేపీ పెట్టిన పార్టీలు, వదిలిన బాణాలు ఇక్కడ పనిచేయవన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉత్తరప్రదేశ్, బీహార్ లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద నడువవన్నారు. బీజేపీ పాదయాత్రలన్నీ వెలవెలబోతున్నాయని, మాటలు ఎక్కువ ప్రజలు తక్కువ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా […]

విధాత: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు వస్తే చాలు, ఈడీలు, ఐటీలు దాడులు చేస్తారు. బీజేపీ పెట్టిన పార్టీలు, వదిలిన బాణాలు ఇక్కడ పనిచేయవన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉత్తరప్రదేశ్, బీహార్ లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద నడువవన్నారు.
బీజేపీ పాదయాత్రలన్నీ వెలవెలబోతున్నాయని, మాటలు ఎక్కువ ప్రజలు తక్కువ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా ప్రజల కోసం నిలబడతామన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలవంచమని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.
Addressing the Press Conference at Jagtial https://t.co/7zPn4PMmkO
— Harish Rao Thanneeru (@trsharish) December 1, 2022
నెలకు లక్ష కోట్ల అప్పు
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద నెలకు లక్ష కోట్ల అప్పు వేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రధాని మోడీ నెల తిరిగే సరికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నారన్నారు. ఈ 8 ఏళ్ల బీజేపీ పాలనలో కోటి కోట్ల అప్పు చేశారన్నారు. మీరు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు. ప్రతి పౌరుడి మీద బీజేపీ ప్రభుత్వం రూ.1.24 లక్షల అప్పు చేసిందన్నారు.