BJP | ఎన్నికలే లక్ష్యంగా.. ఐదు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు!
BJP విధాత: బిజేపి జాతీయ నాయకత్వం మినీ సార్వత్రిక ఎన్నికల సమరంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షులను మార్చి భారీ ప్రయోగాలే చేసింది. తెలంగాణకు బండి సంజయ్ స్ధానంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కు సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరినీ, జార్ఖండ్‌కు బాబూలాల్ మారండనీ, పంజాబ్‌కు సునీల్ చక్కర్ ను, రాజస్థాన్ కు గజేంద్ర సింగ్ షెకావత్ లను బిజేపి అధిష్ఠానం నియమించింది. ఈ మార్పులతో ఆ […]

BJP
విధాత: బిజేపి జాతీయ నాయకత్వం మినీ సార్వత్రిక ఎన్నికల సమరంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షులను మార్చి భారీ ప్రయోగాలే చేసింది. తెలంగాణకు బండి సంజయ్ స్ధానంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కు సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరినీ, జార్ఖండ్‌కు బాబూలాల్ మారండనీ, పంజాబ్‌కు సునీల్ చక్కర్ ను, రాజస్థాన్ కు గజేంద్ర సింగ్ షెకావత్ లను బిజేపి అధిష్ఠానం నియమించింది.
ఈ మార్పులతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆశించిన ప్రయోజనాలు కొత్త అధ్యక్షులు నెరవేరుస్తారని నమ్ముతుంది. త్వరలోనే ప్రధాని మోడీ కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ చేయనున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాజా మార్పులు చేశారు. రాష్ట అధ్యక్ష పదవి కోల్పోయిన బండి సంజయ్ నీ కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్థానాన్ని సంజయ్తో భర్తీ చేసి అయనకు సముచిత స్థానం కల్పించనున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమించడం ద్వారా ఆయనకు సముచిత స్థానం కల్పించినా, ఆ పదవితో ఆయన ఎంత మేరకు సంతృప్తి గా ఉన్నారో మునుముందు తేలనుంది.
ఏపీ నుంచీ బిజేపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు వూహించని రీతిలో పురంధేశ్వరికి కట్టబెట్టిన బీజేపీ అధిష్ఠానం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. సత్యకుమార్‌ను కాదని పురంధేశ్వరినీ అధ్యక్షురాలిని చేయడాన్ని ఏపీ బిజేపి నేతలు కూడా అంచనా వేయలేకపోయారు.
సత్యకుమార్ కు ఉన్న టీడిపి ముద్ర ఆయనను అధ్యక్ష పదవికి దూరం చేసిందని భావిస్తున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వెందుకే పురంధేశ్వరినీ నియమించారన్న ప్రచారం కూడా వినిపిస్తుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటి యైన నేపథ్యం కూడా ఇందుకు కారణం అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.