BJP |
విధాత బ్యూరో, మహబూబ్‌నగర్: కుటుంబాలను కాపాడుకొనే పార్టీలకు బుద్ది చెప్పి భారత భవిష్యత్ కోసం పాటుపడుతున్న బీజేపీకి అధికారం కట్టబెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు ఇచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన నవ సంకల్ప్ యాత్ర బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నరేంద్ర మోడీ తొమ్మిది ఏళ్ళ పాలనపై మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జోగులాంబ అమ్మవారు.. ఉమామహేశ్వర స్వామీని తలుచుకుంటున్నానన్నారు. ఇక్కడ తెలంగాణ వెనకబడింది.. కానీ ఒక్క సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ముందుకు సాగిందని, ఇది చాలా బాధాకరం అన్నారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ పూర్తిగా వెనక్కి నెట్టేసినా… మోడీ.. పాలన వల్ల మొత్తం దేశం తో కలసి తెలంగాణా అభివృద్ది పథాన నడుస్తుందన్నారు.. ఇది నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మోడీ పాలనలో పేద.. రైతు మహిళ వంచిత.. యువత స్వశక్తి కోసం చేస్తుందని తెలిపారు.
మోదీ పాలనలో.. దేశంలో 80 కోట్ల మందికి ఐదుకిలోల బియ్యం.. ఐదు కిలోల ఉచితంగా ఇస్తున్నాం. ఇది ఐరోపా జనాభా కన్నా ఎక్కువ అన్నారు. దేశంలో పేదరికం 22 శాతం నుంచి 10 శాతానికి పరిమితం అయ్యిందని, అత్యంత నిరుపేదలు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నారన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజనను కూడా ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కుంభకోణం జరిగిందని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలా వద్దా అని ప్రశ్నించారు.
దేశంలో నాలుగు కోట్ల మంది పేదలకి ఇండ్లు ఇచ్చామని.. ఇది ఆస్ట్రేలియా దేశ జనాభా కంటే ఎక్కువ అన్నారు. దేశంలో ఎన్నో పథకాల ద్వారా అందరి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. కరోనా తర్వాత.. ఉక్రెయిన్ యుద్ధం తర్వత ప్రపంచం మొత్తం ఆర్థికంగా వెనుకబడిగా.. మన దేశం మాత్రమే ముందుకు సాగిందన్నారు. పదవ స్థానం నుంచి ఐదవ స్థానంలోకి ఎగ బాకిందని తెలిపారు.
మొబైల్ ఫోన్లు ఇపుడు 97 శాతం మన దేశంలోనే తయారు అవుతున్నాయన్నారు. గతంలో 92శాతం దిగుమతి అయ్యేవన్నారు. ఇంతకు ముందు మన ప్రధాని అమెరికా వెళితే.. పాకిస్తాన్.. టెర్రరిజం లాంటి అంశాల పై చర్చ జరిగేది.. ఇపుడు మన మోడీ అమెరికా వెళితే అలాంటి చర్చలున్నయా, కేవలం అభివృద్ధి గురించి చర్చ నడుస్తుందన్నారు.
ఇవ్వాళ్ళ ప్రధాన మంత్రి మోడీ అమెరికా.. ఈజిప్ట్ నుంచి తిరిగి వస్తున్నారు.. నేడు మోడీకి ఈజిప్టు సర్వొత్త పురస్కారం దక్కిందన్నారు. కానీ ఇక్కడి ప్రతిపక్ష పార్టీ నరేంద్ర మోడీని నీచంగా మాట్లాడుతున్నారు. కులం పేరుతో, దొంగంటూ, చాయ్ వాలా అంటూ విషం కక్కుతున్నారని విమర్శించారు.
మోడీ దేశంతోపాటు తెలంగాణ అభివృద్ది కోసం ఎంతో చేశారన్నారు. గత పర్యటనకు వచ్చినపుడు 13 వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణాలో 5వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఇచ్చారని, ఇది హైదరబాద్ నుంచి లద్దాక్ కు రెండు సార్లు వచ్చే రాకపోకలక సమానం అన్నారు. రైళ్లు.. జాతీయ రహదారి.. మెట్రో.. ఎలివేటెడ్ రోడ్స్.. ఇలా ప్రతీ అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు.
The world leaders are heaping praise on PM Modi. When the leaders of India used to go to the US, they used to discuss terrorism, Pakistan and Kashmir. However, when PM Modi visited the US no one discussed Pakistan, they talked about development and growth.
– Shri @JPNadda pic.twitter.com/RBq6kKmQNJ
— BJP (@BJP4India) June 25, 2023
రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే వచ్చిందన్నారు. నిన్న పాట్నా లో ప్రతిపక్షాలు ఫోటో సెషన్ నిర్వహించాయని, కుటుంబ పాలన వాదులు కలిశారని ఎద్దేవా చేశారు. సొఙత కుటుంబాలను రక్షించుకొనుట కోసం సమావేశం అయ్యారన్నారు..
మోడీ మాత్రం దేశాన్ని రక్షించేందుకు పని చేస్తున్నారన్నారు. దేశాన్ని ముందుకు నడపాలంటే బీజేపీకి సహకరించాలని కోరారు.. బీఆర్ఎస్ పేరు మారితే నీతి మారదని.. సీఎం కేసీఆర్ కుటుంబం కాపాడాలంటే.. ఆయన కొడుకును.. అల్లుడిని.. బిడ్డను కాపాడాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని.. అభివృద్ది కావాలంటే బీజేపీ ని గెలిపించండని పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బ్రస్టాచార్ రాక్షసుల సమితి అని మండిపడ్డారు. ధరణీ సీఎం కేసీఆర్ జేబు నింపే పోర్టల్ అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ధరణీ పోర్టల్ ను రద్దు చేస్తుంది.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మహేంద్రనాథ్ పాండే.. మాజీ ఎంపీ డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుకు తల్లోజు ఆచారు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దిలీపాచారితో పాటుగా పలువురు రాష్ట్ర, పాలమూరు ఉమ్మడి జిల్లాల నాయకులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.