BJP | బండి సంజయ్ పరిస్థితిపై ఏడ్చేశా: రాజగోపాల్‌రెడ్డి

BJP కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండని వేడుకోలు విధాత: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని పదవి నుండి మార్చిన సందర్భంలో తాను సంజయ్ పరిస్థితిని చూసి బాధతో కన్నీళ్లు అపుకోలేక బాత్ రూమ్‌కు వెళ్లి ఏడ్చేశానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి బండి సంజయ్ పనితీరును ప్రశంసించారు. బండి హయాంలోనే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణలో బీజేపీ […]

  • Publish Date - July 21, 2023 / 01:29 AM IST

BJP

  • కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండని వేడుకోలు

విధాత: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని పదవి నుండి మార్చిన సందర్భంలో తాను సంజయ్ పరిస్థితిని చూసి బాధతో కన్నీళ్లు అపుకోలేక బాత్ రూమ్‌కు వెళ్లి ఏడ్చేశానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి బండి సంజయ్ పనితీరును ప్రశంసించారు.

బండి హయాంలోనే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణలో బీజేపీ సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్‌లను ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన సంజయ్‌ని గుండెలో పెట్టుకోవడంతో పాటు అధిష్టానం ఆదేశాలను అంతా పాటించాలన్నారు.

తాను కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానన్నారు. కాంగ్రెస్‌లో కొందరు పేరు చెప్పుకుని బతుకుతున్నారన్నారు. తాను బీజేపీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

బండి సంజయ్ మాట్లాడిన సందర్భంలో కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన పూర్తి సహకారం ఉంటుందని, సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తి లేదని, కేసీఆర్ ను గద్దె దించేందుకు, బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా ఐక్యంగా పనిచేయాలన్నారు.

ఇకమీదటనైనా నాయకులు పదేపదే ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం మానుకుని కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.