విధాత: బీజేపీకి రాజకీయాలు, ఓట్లే తప్ప సంస్థలు, వ్యక్తులు, ప్రజల పట్ల గౌరవంలేదని, గవర్నర్ ప్రసంగం పై వారు చేసిన వ్యాఖ్యలే దీన్ని స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు చెప్పారన్న బీజేపీకి నేతల వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండి పడ్డారు. గవర్నరే వారికీ సమాధానం చెప్తారని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించడమంటే గవర్నర్‌ని అవమానించినట్టే అని మంత్రి అన్నారు. రాజ్యాంగ సంస్థలని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం బిజెపి చేస్తుందని ఫైరయ్యారు.
బీజేపీ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గవర్నర్‌తో ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించామంటున్న బీజేపీ నేతలు ఇన్ని రోజులు వారు అబద్దాలు మాట్లాడించారని మేము భావించాలా అని ప్రశ్నించారు.