Medak | దిష్టిబొమ్మ దహనం తెచ్చిన తంటా.. మంటలు వ్యాపించి ఎస్ఐకు గాయాలు

Medak విధాత, మెదక్ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా మెదక్ జిల్లా బీజేపీ అధ్వర్యంలో గురువారం చేపట్టిన దిష్టిబొమ్మ దహనం.. ప్రమాదానికి దారితీసింది. పార్టీ శ్రేణులు స్థానిక రాందాస్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తోపాటు జిల్లా, నియోజకవర్గ, నాయకులు తరలివచ్చారు. ఆందోళనలో భాగంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో […]

Medak | దిష్టిబొమ్మ దహనం తెచ్చిన తంటా.. మంటలు వ్యాపించి ఎస్ఐకు గాయాలు

Medak

విధాత, మెదక్ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా మెదక్ జిల్లా బీజేపీ అధ్వర్యంలో గురువారం చేపట్టిన దిష్టిబొమ్మ దహనం.. ప్రమాదానికి దారితీసింది. పార్టీ శ్రేణులు స్థానిక రాందాస్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తోపాటు జిల్లా, నియోజకవర్గ, నాయకులు తరలివచ్చారు. ఆందోళనలో భాగంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు.

ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న పట్టణ ఎస్ఐ పోచయ్య అధ్వర్యంలో పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మంటలు అంటుకున్న దిష్టిబొమ్మను పక్కకు జరిపే ప్రయత్నంలో మరింత చెలరేగాయి.

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ కు మంటలు అంటుకున్నాయి. చేతులు అడ్డు పెట్టుకోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎస్ఐ పోచయ్య కూడా గాయపడ్డారు. చెంపకు, చేతుల కు గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.