ఏపీలో నలుపు నిషిద్ధం.. ఆ డ్రెస్ ఉన్నా సీఎం సభకు నో ఎంట్రీ

విధాత: తెలుగులో నాకు నచ్చని పదం ‘క్షమించడం’ అని అంటాడు చిరంజీవి ఓ సినిమాలో.. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నలుపు రంగు అంటే నచ్చడం లేదట.. ఆ రంగును నిషేధించారట. ముఖ్యమంత్రి సభకు నల్ల చొక్కాలు.. నల్ల చీరలు..ఇంకా మాట్లాడితే నల్ల చున్నీలతో కూడా సభలకు రావద్దట. అలా వస్తే ప్రభ్యత్వం పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు మీనింగ్ ఆట. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వచ్చే ముఖ్యమంత్రికి […]

  • Publish Date - November 22, 2022 / 01:18 PM IST

విధాత: తెలుగులో నాకు నచ్చని పదం ‘క్షమించడం’ అని అంటాడు చిరంజీవి ఓ సినిమాలో.. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నలుపు రంగు అంటే నచ్చడం లేదట.. ఆ రంగును నిషేధించారట.

ముఖ్యమంత్రి సభకు నల్ల చొక్కాలు.. నల్ల చీరలు..ఇంకా మాట్లాడితే నల్ల చున్నీలతో కూడా సభలకు రావద్దట. అలా వస్తే ప్రభ్యత్వం పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు మీనింగ్ ఆట. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వచ్చే ముఖ్యమంత్రికి ఇబ్బంది కూడా కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆయన ఏదైనా ఊరికి వెళితే.. అక్కడ ముందస్తుగా షాపులు మూసేయటంతో పాటు బోలెడన్ని ఆంక్షలు పెడుతూ బారికేడ్స్ పెట్టి ప్రజల్ని నియంట్చేర్న్నాఐస్ట్ పోఉన్నారు. మొన్న నరసాపురంలో సీఎం జగన్ నిర్వహించిన సభకు హాజరైన మహిళల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు తావిచ్చింది.

నల్లరంగు చున్నీలు వేసుకొచ్చిన మహిళల నుంచి వారి చున్నీలు తీసుకొని వేరే చోట ఉంచి.. తిరిగి వెళ్లేటప్పుడు తీసుకోవాలని పోలీసులు చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయ్. అలాగని రాష్ట్రంలో మొత్తం నల్ల రంగును.. నలుపు దుస్తులను నిషేధిస్తారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఏలూరు రేంజి పోలీసులు మాత్రం అదేం లేదని.. మహిళలను మహిళా పోలీసులతో జస్ట్ తనిఖీలు చేయించామని, అంతకు మించి ఇంకేం లేదని అంటున్నారు.