NTR31: బాలీవుడ్ హీరోయిన్ను పెట్టాల్సిందే!.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
JR NTR, విధాత: స్టార్ హీరోలతో చిత్రాలు అంటే సామాన్యం కాదు. వీరాభిమానులను దృష్టిలో ఉంచుకోవాలి. అభిమానుల మనోభావాలకు విలువ ఇవ్వాలి. అదే సమయంలో తమ కథలో తప్పులు జరగకుండా.. హీరోయిజం కోసం తప్పుదోవ పట్టకుండా.. ఎంతో బ్యాలెన్సింగ్‌గా సినిమా తీయాలి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం లాగా పరిస్థితి ఉంటుంది. అందుకే వైకుంఠపాళి ఆడినంత కష్టం స్టార్ హీరోలను డీల్ చేయడం అంటే. సాధారణంగా దర్శకులు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం వేరు. […]

JR NTR, విధాత: స్టార్ హీరోలతో చిత్రాలు అంటే సామాన్యం కాదు. వీరాభిమానులను దృష్టిలో ఉంచుకోవాలి. అభిమానుల మనోభావాలకు విలువ ఇవ్వాలి. అదే సమయంలో తమ కథలో తప్పులు జరగకుండా.. హీరోయిజం కోసం తప్పుదోవ పట్టకుండా.. ఎంతో బ్యాలెన్సింగ్‌గా సినిమా తీయాలి.
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం లాగా పరిస్థితి ఉంటుంది. అందుకే వైకుంఠపాళి ఆడినంత కష్టం స్టార్ హీరోలను డీల్ చేయడం అంటే. సాధారణంగా దర్శకులు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం వేరు. కానీ అదే దర్శకుడు ఆ స్టార్ హీరోకు వీరాభిమాని అయితే కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
అభిమానులు ఆయన నుంచి ఏమీ ఆశిస్తున్నారు.. తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారు. ఇవ్వన్నీ ఆ దర్శకుడికి బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్‌ని మెప్పించేలా, ప్రేక్షకులను మురిపించేలా ఆ సినిమా తీయగలరు. వాస్తవానికి బాలీవుడ్లో వచ్చిన దబాంగ్ చిత్రం అంత గొప్పదేమీ కాదు.
కానీ దాన్ని పవన్‌కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ తన అభిమాన హీరోకి తగ్గట్టుగా మలిచి ఒక్కో సీనును, ఒక్కో డైలాగ్‌ను రంజింపజేశాడు. ప్రేక్షకులను సీట్లలో నుంచి పైకెగిరించి కేరింతలు కొట్టించాడు. మాస్‌తో పాటు క్లాసు ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఓ ఊపు ఊపాడు. ఇలా తీసుకుంటే హరీష్‌శంకర్ వంటి దర్శకులు ఎందరో ఉన్నారు.
విషయానికి వస్తే తాజాగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ రెబెల్ ప్రభాస్‌తో సలార్ మూవీ తీస్తున్నాడు. కానీ ఇందులో హీరోయిన్గా శృతిహాసన్‌ని ఎంచుకోవడం ఎవరికి ఇష్టం లేదంటే అతిశయోక్తి కాదు.
అంతకంటే మంచి ఛాయిస్‌లు ఎన్నో ఉన్నా.. ప్రశాంత్ నీల్ ఆ విషయంలో ఎందుకో గాని తప్పటడుగు వేశాడని చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ చిత్రంపై కూడా దృష్టి పెట్టాడు. ఆర్ఆర్ఆర్ వంటి తిరుగులేని హిట్ తర్వాత తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో తన పాన్ ఇండియా మార్కెట్‌ను పెంచుకోవాలని యంగ్ టైగర్ ఆలోచిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ చేయబోయే చిత్రాల లిస్ట్‌లో అందరి ఫోకస్ ఎక్కువగా కొరటాల శివ మీద కంటే ప్రశాంత్ నీల్ మీదనే ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్31 చిత్రంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఇటీవల యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
దర్శకుడు ప్రశాంత్ నీల్ టైటిల్ విషయంలో పెద్దగా ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలైనప్పుడే టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాడు. టైటిల్‌తోనే సినిమాకు మంచి హైట్ క్రియేట్ చేయాలి అనుకుంటాడు. కాబట్టే ప్రస్తుతం ఒక నాలుగు ఐదు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నాడు. వాటిలో ఏది బాగుంటే దానిని ఎంచుకొని వాటిలో ఫైనల్ టైటిల్‌ను నిర్ణయించనున్నాడు.
కాగా, ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ చిత్రం కోసం ‘అసుర’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మూవీ షూటింగ్‌కు చాలా సమయం ఉన్నా కూడా.. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
ప్రశాంత్ నీల్.. తారక్‌ను కూడా డి గ్లామర్ లుక్‌లో చూపించనున్నప్పటికీ.. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్ల ఎంపికపై కొన్ని విమర్శలు ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు సలార్‌లో శృతిహాసన్ విషయం. ఆ పొరపాటు తమ హీరోకు జరగకూడదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రశాంత్ నీల్.. తారక్ 31 కోసం హీరోయిన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ను తారక్‌కు జోడిగా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా, ప్రశాంత్ నీల్ మనసులో ఏ హీరోయిన్ ఉన్నారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం..!