అరెస్ట్ చేయిస్తా.. కమ్ టు మై రూమ్.. బ్రహ్మాజీ సీరియస్ కామెడీ

విధాత: వయసు పెరుగుతున్నా.. తన కొడుకు పెళ్లీడు వయసుకు వచ్చినా.. నటుడు బ్రహ్మాజీ మాత్రం ఇంకా ‘సింధూరం’ సినిమాలో ఎలా అయితే ఉన్నాడో.. అలాగే కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆయనంత యాక్టివ్‌గా మరో సెలబ్రిటీ ఉండడంటే అతిశయోక్తి కానే కాదు. ఇప్పటికీ అందరినీ నవ్వించడమే కాకుండా.. సీరియస్ పాత్రలలోనూ బ్రహ్మాజీ నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’. ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా […]

  • By: krs    latest    Nov 03, 2022 8:11 AM IST
అరెస్ట్ చేయిస్తా.. కమ్ టు మై రూమ్.. బ్రహ్మాజీ సీరియస్ కామెడీ

విధాత: వయసు పెరుగుతున్నా.. తన కొడుకు పెళ్లీడు వయసుకు వచ్చినా.. నటుడు బ్రహ్మాజీ మాత్రం ఇంకా ‘సింధూరం’ సినిమాలో ఎలా అయితే ఉన్నాడో.. అలాగే కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆయనంత యాక్టివ్‌గా మరో సెలబ్రిటీ ఉండడంటే అతిశయోక్తి కానే కాదు. ఇప్పటికీ అందరినీ నవ్వించడమే కాకుండా.. సీరియస్ పాత్రలలోనూ బ్రహ్మాజీ నటిస్తున్నారు.

తాజాగా ఆయన నటించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’. ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా రీసెంట్‌గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో బ్రహ్మాజీ స్టేజ్‌పై ప్రభాస్, అనసూయల డైలాగ్స్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.

ఇటీవల ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ టైమ్‌లో ప్రభాస్.. ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్‌ని సీరియస్‌గా.. ‘ఓం కమ్ టు మై రూమ్’ అని పిలుస్తోన్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వారందరినీ అరెస్ట్ చేయిస్తానంటూ.. ఆ మధ్య అనసూయ కూడా హడావుడి చేసింది.

ఈ రెండు ఇన్సిడెంట్స్‌ను తలపిస్తూ.. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో.. ఫ్యాన్స్ అల్లరి చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ఏయ్.. ఉండ్రా.. ఎవడ్రా వాడు.. కేసేస్తా నీ మీద.. సైలెన్స్, కమ్ టు మై రూమ్’’ అంటూ బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం నవ్వులతో హోరెత్తింది.

ఇదంతా సీరియస్ అనుకుంటున్నారేమో.. జస్ట్ ఫన్ కోసమే బ్రహ్మాజీ అలా చేశాడు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. ఇక బ్రహ్మాజీ ఇలా సీరియస్‌గా కామెడీ చేసిన ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.