Brahmaji | మేకప్ వేసుకొని జిమ్‌కి వెళతారా.. బ్రహ్మాజీ పంచ్‌కి నోట మాట రాలేదు..!
Brahmaji | సినీ వార పత్రిక ‘సంతోషం’ ఎడిటర్, సీనియర్ సినిమా పాత్రికేయుడు సురేష్ కొండేటి ఇటీవలి కాలంలో సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆయన వేసే ప్రశ్నలు కాస్త విచిత్రంగా ఉన్నా కూడా వాటికి ఏదో సమాధానం అయితే సెలబ్రిటీల నుండి వస్తుంది. ఇక ప్రెస్‌మీట్ లో వేసే కుళ్లు ప్రశ్నలకి భారీ ఎత్తున ట్రోల్స్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ట్రోల్స్ వలన ఫుల్ పాపులారిటీ […]

Brahmaji |
సినీ వార పత్రిక ‘సంతోషం’ ఎడిటర్, సీనియర్ సినిమా పాత్రికేయుడు సురేష్ కొండేటి ఇటీవలి కాలంలో సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆయన వేసే ప్రశ్నలు కాస్త విచిత్రంగా ఉన్నా కూడా వాటికి ఏదో సమాధానం అయితే సెలబ్రిటీల నుండి వస్తుంది.
ఇక ప్రెస్‌మీట్ లో వేసే కుళ్లు ప్రశ్నలకి భారీ ఎత్తున ట్రోల్స్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ట్రోల్స్ వలన ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సురేష్ కొండేటిని కొన్ని చిన్న సినిమాలు తమ సినిమా ప్రమోషన్స్‌కి వాడుకుంటుండడం విడ్డూరంగా ఉంది.ఇక సోషల్ మీడియాలోను అప్పుడప్పుడు ఆసక్తికర పోస్ట్‌లు పెడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు సురేష్ కొండేటి.
రీసెంట్‌గా సురేష్ కొండేటి తన ట్విట్టర్‌లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ రోజు నా జిమ్ వర్కవుట్ పిక్స్ అంటూ సురేష్ షేర్ చేసిన పిక్స్ లో ఆయన బ్లూ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్, షూస్ ధరించి ముఖానికి ఫుల్‌గా మేకప్ వేసుకున్నట్టుగా కనిపించాడు.
ఇక ఇది చూసిన నటుడు బ్రహ్మాజీ.. సురేష్ కొండేటికి సెటైర్ వేశారు. ‘మీరు మేకప్ వేసుకుని జిమ్‌కి వెళ్తారా’ అని సురేష్ కొండేటి పోస్ట్‌కి కామెంట్ పెట్టారు. దీనికి వెంటనే సురేష్ కొండేటి స్పందిస్తూ.. ‘ఇది నా ఒరిజినల్ ఫేస్.. మేకప్ వేసుకోలేదు’ అని సమాధానం అన్నారు.
దీనికి మళ్లీ బ్రహ్మాజీ తన జిఫ్ ఇమేజ్‌తో రిప్లై ఇస్తూ ఇదేదో తేడా ఉందే అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. బ్రహ్మాజీ రిప్లైకి నెటిజనులు కూడా బాగానే కనెక్ట్ అయిపోయి సురేష్ కొండేటిని తెగ ఆడేసుకుంటున్నారు. అయితే సురేష్ కొండేటి తన పోస్ట్‌కి ఇంగ్లీష్‌లో పెట్టిన కామెంట్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇదేం ఇంగ్లిష్ అంటూ కొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే, ఇంకొందరు సురేష్ చాలా బాగున్నారని.. హీరో కంటెంట్ ఉందని ఆయనని ఆకాశానికి ఎత్తుతున్నారు. మొత్తం మీద జిమ్ వర్కౌట్ ఫొటోలతో సురేష్ కొండేటి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పిక్స్ కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.