Uttar Pradesh | పెళ్లి అనగానే అమ్మాయిలు తన రాకుమారుడి అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని కలలు కంటారు. అందంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అలాంటి యువకుడి కోసం అమ్మాయిలు తపన పడుతుంటారు. అలాంటి వారినే వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే పెళ్లి మండపంలో తాళి కట్టే వేళ అతడితో వివాహం ఇష్టం లేదని బాంబు పేల్చింది. ఎందుకంటే అతని ముక్కు చిన్నగా ఉందని చెప్పి, పెళ్లిని క్యాన్షిల్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని సాంబాల్ జిల్లా అస్మోలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ యువతికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో పెళ్లికుమారుడితో అతని కుటుంబ సభ్యులు ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి మండపంలో అందరూ ఆశీనులయ్యారు. అయితే పెళ్లి కుమారుడి ముక్కు చిన్నదిగా ఉందని పెళ్లికి వచ్చిన వారు గుసగుసలాడుకున్నారు.
ఈ విషయం వధువుకు తెలిసింది. ఆమె కూడా వరుడి ముక్కును నిశితంగా పరిశీలించింది. ఇక అతని ముక్కు సన్నగా, చిన్నగా ఉందని పెళ్లి క్యాన్షిల్ చేసింది. అందరూ షాక్‌కు గురయ్యారు. వధువుకు తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా.. ఆమె వినిపించుకోలేదు. చివరకు చేసేదేమీ లేక వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు.