పెళ్లి పీటలపైనే నిద్రించిన పెళ్లికుమార్తె.. వీడియో వైరల్
విధాత: పెళ్లి అంటేనే హడావుడి ఉంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతో పాటు కుటుంబ సభ్యులకు, బంధువులకు నిద్ర ఉండదు. కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు.. ఓ కునుకు తీస్తారు. కానీ వధూవరులకు మాత్రం ఆ ఛాన్సే ఉండదు. సంప్రదాయ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలే గంటల తరబడి కొనసాగుతాయి. అలాంటప్పుడు ఆ కొత్త జంట కునుకు తీసే అవకాశమే ఉండదు. అలాంటి అనుభవమే ఓ పెళ్లికుమార్తెకు ఎదురైంది. వివాహ తంతు జరుగుతుండగానే.. పక్కన […]

విధాత: పెళ్లి అంటేనే హడావుడి ఉంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతో పాటు కుటుంబ సభ్యులకు, బంధువులకు నిద్ర ఉండదు. కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు.. ఓ కునుకు తీస్తారు.
కానీ వధూవరులకు మాత్రం ఆ ఛాన్సే ఉండదు. సంప్రదాయ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలే గంటల తరబడి కొనసాగుతాయి. అలాంటప్పుడు ఆ కొత్త జంట కునుకు తీసే అవకాశమే ఉండదు. అలాంటి అనుభవమే ఓ పెళ్లికుమార్తెకు ఎదురైంది. వివాహ తంతు జరుగుతుండగానే.. పక్కన వరుడు ఉన్నప్పటికీ, పెళ్లికూతురు నిద్రలోకి జారుకుంది. ఈ వీడియో గతేడాది అయినప్పటికీ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఈ వీడియోను స్వయనా పెళ్లి కుమార్తెనే తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. అక్కడ నిద్రిస్తున్నది తానే. పొద్దున్న 6:30 గంటలు కావొస్తున్నప్పటికీ.. సంప్రదాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో నిద్ర పోవాల్సి వచ్చిందని పేర్కొంది. వధువు కూర్చొని ఉండగా, వరుడు నిల్చొని ఉన్న దృశ్యం ఆ వీడియో కనిపిస్తోంది.