క్రికెట్ వరల్డ్ కప్ ప్రసారంలో బీఆరెస్ యాడ్స్‌

క్రికెట్ వరల్డ్ కప్ ప్రసారంలో బీఆరెస్ యాడ్స్‌

గులాబీ పార్టీ సూపర్ ప్లాన్‌

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే ఏ అవకాశాన్ని వదలకుండా ప్రచారం చేసుకోవడంలో పార్టీలు పోటీలు పడుతున్నాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్ ప్రసారం చేసిన డిస్నీ హాట్ స్టార్ చానల్‌ను కూడా ఎన్నికల ప్రచారానికి వాడేసాయి. ముఖ్యంగా యూత్‌లో ఉండే క్రికెట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న బీఆరెస్ పార్టీ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తమ పార్టీ ఎన్నికల ప్రచార యాడ్స్ ప్రసారం చేసుకుని మంచి పబ్లిసిటీ కొట్టేసింది. కోట్ల మంది వీక్షించిన ఈ చానల్‌లో బీఆరెస్ ఎన్నికల ప్రచార ప్రకటనల ప్రసారం వినూత్నంగా ఎత్తుగడగా కనిపించింది.