బీఆరెస్ స‌ర్కారు సాగు నీళ్ల కోసం ఎక‌రానికి ఎంత ఖర్చు చేసిందో తెలుసా…

నీళ్లు- నిధులు- నియామ‌కాల ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న త‌రువాత నీళ్ల మాటున అవినీతి నిధుల వ‌ర‌ద పారింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్యక్త‌మ‌వుతోంది

బీఆరెస్ స‌ర్కారు సాగు నీళ్ల కోసం ఎక‌రానికి ఎంత ఖర్చు చేసిందో తెలుసా…
  • ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చుచేసి క‌ట్టిన ప్రాజెక్ట్‌ల నుంచి ఎన్ని ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చాయంటే…


విధాత‌: నీళ్లు- నిధులు- నియామ‌కాల ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ఉద్య‌మం నిర్వ‌హించి, ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్న త‌రువాత నీళ్ల మాటున అవినీతి నిధుల వ‌ర‌ద పారింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య క్త‌మ‌వుతోంది. నీళ్ల మాటున జ‌రిగిన ఈ దోపిడీ కార‌ణంగా క‌ట్టిన ప్రాజెక్ట్‌ల‌కు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు కాగా… అవి మూనాళ్ల ముచ్చ‌టే అన్న‌ట్లు మేడిగ‌డ్డ బారాజ్ కుంగింది. అన్నారం, సుందిళ్ల‌ల‌కు ప్ర‌మాదం పొంచి ఉంది.



 


తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆరెస్ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై నే కేంద్రీకరించిన విష‌యం అందరికి తెలిసిందే… శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు సొరంగాన్ని ప‌క్క‌న బెట్టా రు కానీ కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్మించారు. పాల‌మూరు -రంగారెడ్డి చేప‌ట్టారు. ప్ర‌పంచంలో అద్భుత నిర్మాణంగా బీబీసీ కూడా కీర్తించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను ఒక ప‌ర్యాట‌క ప్రాంతంగాను మార్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఈ ప‌దేళ్ల‌లో ఈ ప్రాజెక్ట్‌ల‌కు పెట్టిన ఖ‌ర్చు కొత్త‌గా సాగులోకి వ‌చ్చిన ఆయ‌క‌ట్టును ప‌రిశీలిస్తే అంద‌రూ నోరెళ్ల‌బెట్టాల్సిందే… పైగా ఇప్ప‌టి వ‌ర‌కు బీఆరెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన మేడిగ‌డ్డ బారాజ్ కుంగిన విష‌యం కూడ అంద‌రికి తెలిసిందే.


 



ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి గ‌త ప్ర‌భుత్వాలు ఎంత ఖ‌ర్చు చేశాయి… ఎన్ని ఎక‌రాల‌కు నీళ్లు ఇచ్చాయి… బీఆరెస్ ప్ర‌భుత్వం ఎంత ఖ‌ర్చు చేసి, ఎన్ని ఎక‌రాల‌కు నీళ్లు ఇచ్చాయి, సగ‌టున సాగునీటి ప్రాజెక్ట్‌ల ఖ‌ర్చు ఎక‌రానికి ఎంత అయింద‌నేది చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. అ వివ‌రాల‌ను రాష్ట్ర సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి శ‌నివారం శాస‌న స‌భ‌లో సాగునీటి పారుద‌ల‌పై విడుద‌ల చేసిన శ్వేత ప‌త్రం స్ప‌ష్టం చేసింది.



 


గ‌త ప్ర‌భుత్వాలు 2014 వ‌ర‌కు సాగునీటి ప్రాజెక్ట్‌ల‌కు ఒక్క ఎక‌రానికి రూ.93 వేలే ఖ‌ర్చు చేస్తే బీఆరెఎస్ ప్ర‌భుత్వం ఈ ప‌దేళ్ల‌లో సాగునీటి ప్రాజెక్ట్‌ల‌కు ఒక్క ఎక‌రానికి రూ.11.45 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే నాటికి వ‌ర‌కు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లో సాగునీటి పారుద‌ల రంగానికి రూ. 54,234 కోట్లు ఖ‌ర్చు చేసి 57.79 లక్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తే.. బీఆరెస్ ప్ర‌భుత్వం ఈ ప‌దేళ్ల కాలంలో రూ.1.81 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి కేవ‌లం15.81 లక్ష‌ల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టుకు మాత్ర‌మే సాగునీరు అందించిండం గ‌మ‌నార్హం.