అధినేత చుట్టూ జోకుడుగాళ్లే ఉన్నారు: ఎమ్మెల్సీ రవీందర్ రావు
వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు హాట్ కామెంట్ చేశారు

- ఉద్యమం తెలియనివారికి పదవులు
- ఎర్రబెల్లి, సత్యవతి మంత్రలయినప్పుడు ఉద్యమకారులు బాధపడ్డారు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు హాట్ కామెంట్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు హాట్ కామెంట్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్ మాట్లాడుతూ వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అంటూ తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ప్రశ్నించారు. అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారని అన్నారు. వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాల్లు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయని ప్రశ్నించారు.
ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారన్నారు. ఎర్రబెల్లిని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి చక్కిలి గింతలు పెట్టడం తప్పా ఎవ్వరికీ రూపాయి సహాయం చేయరని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో మా ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని అన్నారు. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్లాన్ లేకపోతే ఎలా గెలుస్తామన్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదన్నారు. కుక్కలు కూడా వారి వెంట పడవంటూ అన్నారు