Manchiryala: BRS హ్యాట్రిక్ విజయానికి కృషి చేయాలి.. నస్పూర్‌లో ఆత్మీయ సమ్మేళనం: MLA దివాక‌ర్‌రావు

విధాత‌: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన గులాబీ శ్రేణులతో ఎమ్మెల్యే దివాకర్ రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేస్తూ రాబోయే […]

  • Publish Date - April 9, 2023 / 01:22 AM IST

విధాత‌: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన గులాబీ శ్రేణులతో ఎమ్మెల్యే దివాకర్ రావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త సమన్వయంతో పనిచేసి బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి గెలుపుకు కృషి చేయాలని కోరారు.

పార్టీ శ్రేణులు అందర్నీ కలుపుకుని కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి హ్యాట్రిక్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో BRS యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, పట్టణ కౌన్సిలర్లు, TBGKS నాయకులు, BRS ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.