బస్సులో దోపిడీ విఫలయత్నం
విధాత, అంబేద్కర్ కొనసీమ జిల్లా: శంషాబాద్ నుండి గల్ఫ్ ప్రయాణికులతో కొనసీమ జిల్లాకు వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు బస్సులో ఆదివారం దోపిడీ యత్నం జరిగింది. పాలకొల్లు సమీపంలో ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ, ఇతర ప్రయాణికులు అందరి పై కారం చల్లి విలువైన వస్తువులు దొంగిలించే ప్రయత్నం చేశాడు. బస్సు సిబ్బంది ప్రయాణికులు అప్రమత్తమవడంతో దొంగ తప్పించుకొనే ప్రయత్నం చేసాడు. కారం కళ్ళలో చేరి మంట పుట్టిస్తున్నా., ఏం జరుగుతుందో చూసే అవకాశం లేకపోయినప్పటికి […]

విధాత, అంబేద్కర్ కొనసీమ జిల్లా: శంషాబాద్ నుండి గల్ఫ్ ప్రయాణికులతో కొనసీమ జిల్లాకు వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు బస్సులో ఆదివారం దోపిడీ యత్నం జరిగింది. పాలకొల్లు సమీపంలో ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ, ఇతర ప్రయాణికులు అందరి పై కారం చల్లి విలువైన వస్తువులు దొంగిలించే ప్రయత్నం చేశాడు.
బస్సు సిబ్బంది ప్రయాణికులు అప్రమత్తమవడంతో దొంగ తప్పించుకొనే ప్రయత్నం చేసాడు. కారం కళ్ళలో చేరి మంట పుట్టిస్తున్నా., ఏం జరుగుతుందో చూసే అవకాశం లేకపోయినప్పటికి ప్రయాణికులు దొంగను ప్రతిఘటించి అడ్డుకొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగను అదుపులోకి తీసుకొన్నారు. తదుపరి బస్సు ప్రయాణికులతో రాజోలు డిపోకు చేరుకుంది.