మద్యం కుంభకోణం కంటే ఎమ్మెల్యేల కొనుగోలు పెద్ద స్కామ్: జగ్గారెడ్డి
విధాత: కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరస్థులే.. ఇద్దరినీ అరెస్టు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సంతోష్‌ను ముందుంచి మోడీ, అమిత్‌షాలే కొంటున్నారని ఆయన ఆరోపించారు. బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని, బీఎల్ కోర్టులను అడ్డం పెట్టుకుని బయట పడాలని చూస్తున్నారని, ఆయన అరెస్టు అయితే చాలా విషయాలు బయటకు వస్తాయని అన్నారు. మద్యం కుంభకోణం కంటే ఎమ్మెల్యేలను కొనడం పెద్ద స్కామ్ అని జగ్గారెడ్డి అన్నారు. […]

విధాత: కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరస్థులే.. ఇద్దరినీ అరెస్టు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సంతోష్‌ను ముందుంచి మోడీ, అమిత్‌షాలే కొంటున్నారని ఆయన ఆరోపించారు.
బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని, బీఎల్ కోర్టులను అడ్డం పెట్టుకుని బయట పడాలని చూస్తున్నారని, ఆయన అరెస్టు అయితే చాలా విషయాలు బయటకు వస్తాయని అన్నారు.
మద్యం కుంభకోణం కంటే ఎమ్మెల్యేలను కొనడం పెద్ద స్కామ్ అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలను కూడా బీజేపీ ట్రాప్ చేయాలని చూస్తున్నదని, సంతోష్, కవితను అరెస్టు చేయడమే అజెండాగా త్వరలో పార్టీ నేతల భేటీ ఉంటుందన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం.. ఎవరికి తగులుతుందో తెలియదన్నారు.
రైతుల పక్షాన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ధరణిలో లోటుపాట్లు, అవకతవకలు ఉన్నాయని, రైతుల పక్షాన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, కొప్పుల రాజు, రాజనర్సింహ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ధరణి భూసమస్యలపై సమావేశంలో చర్చించాం. మండలానికి ఐదుగురు చొప్పున రాష్ట్రమంతటా వివరాలు సేకరిస్తామన్నారు. ఈ నెల 11న ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున 3 వేల మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు.