BYJU’s Layoffs | వెయ్యి మంది ఉద్యోగులకు బైజూస్ మంగళం..! కారణాలు ఏంటంటే..?
BYJU's Layoffs | ఎడ్యుకేషన్-టెక్నాలజీ కంపెనీ బైజూస్ తన పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నది. మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్, టెక్నాలజీ రంగాల్లో పని చేసే ఉద్యోగులు ప్రభావితం కానున్నట్లు తెలుస్తున్నది. తొలగించనున్న ఉద్యోగులు.. కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు రెండు శాతం ఉంటుందని తెలుస్తున్నది. బిలియన్ డాలర్ల రుణం చెల్లింపు విషయంలో అమెరికా కోర్టులో చట్టపరమైన వివాదం నేపథ్యంలో కంపెనీ పొదుపు మత్రం పాటిస్తున్నది. ఇందులో భాగంగానే […]

BYJU’s Layoffs | ఎడ్యుకేషన్-టెక్నాలజీ కంపెనీ బైజూస్ తన పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నది. మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్, టెక్నాలజీ రంగాల్లో పని చేసే ఉద్యోగులు ప్రభావితం కానున్నట్లు తెలుస్తున్నది.
తొలగించనున్న ఉద్యోగులు.. కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు రెండు శాతం ఉంటుందని తెలుస్తున్నది. బిలియన్ డాలర్ల రుణం చెల్లింపు విషయంలో అమెరికా కోర్టులో చట్టపరమైన వివాదం నేపథ్యంలో కంపెనీ పొదుపు మత్రం పాటిస్తున్నది. ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నది.
అంతేకాకుండా బైజూస్ అనుబంధ వైట్‌హ్యాట్ జూనియర్‌లో సైతం పలువురు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బైజూస్ హెచ్ఆర్ విభాగం ఉద్యోగులతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నది.
గతవారం నుంచే లే-ఆఫ్స్ ప్రక్రియ మొదలవగా, పలువురు ఉద్యోగులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం కల్పిస్తున్నది. రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ల పేర్లు సైతం తొలగింపు జాబితాలో ఉన్నాయి. తొలగించనున్న అందరు ఉద్యోగులకు రెండు నెలల వేతనం ఇచ్చేందుకు అంగీకరించగా.. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ వరకు చెల్లింపులు చేయనున్నారు.
వాస్తవానికి అక్టోబర్ 2022 నుంచి వచ్చే ఆరు నెలల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని బైజూస్ ఇంతకుముందు ప్రకటించింది. ఆ తర్వాత తొలగింపులు ఉండవని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. తాజాగా అమెరికాలో రుణంపై వడ్డీ చెల్లింపు విషయం విఫలమైంది.
దాంతో చట్టపరమైన చిక్కులు ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఆపరేషన్స్, లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌తో పాఉట ఇతర రంగాలను కొంత వరకు అవుట్ సోర్సింగ్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధి వర్గాలు తెలిపాయి.