గుజరాత్‌లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

విధాత: గుజరాత్‌లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛట్ పూజ సందర్భంగా భక్తులు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చాలామంది నదిలో పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గుజరాత్‌లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి https://t.co/zvuXgd9RQBSeveral people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. pic.twitter.com/4b0D5kyKIQ — […]

  • By: krs    latest    Oct 30, 2022 2:47 PM IST
గుజరాత్‌లో ఘోర ప్రమాదం: 500 మందితో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

విధాత: గుజరాత్‌లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛట్ పూజ సందర్భంగా భక్తులు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చాలామంది నదిలో పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి.

దాదాపు 140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రమాదానికి గురికావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండడంతో వీరిలో 100 మందికి పైగా నదిలో మునిగిపోయారు.

కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 35మంది మృతిచెందినట్టు మంత్రి బ్రిజేశ్‌ మెజ్రా ప్రకటించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.