మునుగోడు: అభ్యర్థి రోడ్డు రూరల్ గుర్తు మార్పు.. రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం
విధాత, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై సాయంత్రం నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే.. డ్రాలో శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తు దక్కగా, స్థానిక ఆర్వో […]

విధాత, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు రోలర్ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై సాయంత్రం నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
అయితే.. డ్రాలో శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తు దక్కగా, స్థానిక ఆర్వో రెండు రోజుల తర్వాత ఆయన గుర్తును మార్చి వేశారు. రోడ్డు రోలర్‌కు బదులు బేబి వాకర్ గుర్తు కేటాయించారు. ఆర్వో చర్యపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు, అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ వివాదంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం శివకుమార్‌కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

గుర్తులు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సాయంత్రం వరకు రిపోర్ట్ ఇవ్వాలని, మునుగోడు ఆర్వో నుంచి వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశం ఇచ్చారు. అలాగే ఆల్ఫాబెటికల్ అనుసరించి శివకుమార్ పేరు ఈవిఎంలో ఆరో స్థానంలో ఉండగా, పద్నాలుగో స్థానానికి మార్చడం కూడా వివాదాస్పదమైంది.