యూపీలో ఘోర ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. జాన్‌పూర్ - అజాంఘ‌ర్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది

యూపీలో ఘోర ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. జాన్‌పూర్ – అజాంఘ‌ర్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న 9 మందిలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఒక చిన్నారి ఉంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదానికి అతి వేగమే కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు.

బాధితులంతా బీహార్‌లోని సీతామ‌ర్హి నుంచి యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్ర‌యాగ్‌రాజ్ స‌మీపంలోని ఝుషీలో పెళ్లి సంబంధం కోసం వెళ్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు.