Tamilnadu | ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి ( Video)

Tamilnadu | విధాత‌: త‌మిళ‌నాడులోని సేల‌మ్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సేల‌మ్ - ఈరోడ్ మ‌ధ్య ఉన్న హైవేపై ఓ డీసీఎం ఆగి ఉంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి.. ఆగివున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్ర‌మాదానికి గురైన […]

  • Publish Date - September 6, 2023 / 04:55 AM IST

Tamilnadu |

విధాత‌: త‌మిళ‌నాడులోని సేల‌మ్‌లో బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. హైవేపై ఆగివున్న డీసీఎంను.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సేల‌మ్ – ఈరోడ్ మ‌ధ్య ఉన్న హైవేపై ఓ డీసీఎం ఆగి ఉంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి.. ఆగివున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్ర‌మాదానికి గురైన కారులో మొత్తం 8 మంది ఉన్నారు. ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవ‌ర్‌, మ‌రో మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Latest News