Viveka Murder Case | ఉదయ్ రెడ్డిని అందుకే అరెస్టు చేశాం: CBI

విధాత: కడప మాజీ ఎంపీ వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య (Viveka Murder Case) తరువాత ఆధారాలు చెరిపేసేందుకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించాడని, విచారణ నుంచి తప్పించుకునేందుకు పారిపోతాడనే ఉద్దేశంతోనే మందస్తుగా ఆయనను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో వివేకానంద రెడ్డి హత్యోదంతంపై అనేక విషయాలు వెల్లడించింది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు ప్రయత్నించారని, […]

  • Publish Date - April 15, 2023 / 12:05 PM IST

విధాత: కడప మాజీ ఎంపీ వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య (Viveka Murder Case) తరువాత ఆధారాలు చెరిపేసేందుకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించాడని, విచారణ నుంచి తప్పించుకునేందుకు పారిపోతాడనే ఉద్దేశంతోనే మందస్తుగా ఆయనను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది.

కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో వివేకానంద రెడ్డి హత్యోదంతంపై అనేక విషయాలు వెల్లడించింది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు ప్రయత్నించారని, హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడన్నారు. ఆ తరువాత ఎంపీ అవినాష్ ఇంట్లో ఉదయ్, శివశంకర్ రెడ్డి గడిపారన్నారు.

చనిపోయినట్లు నిర్థారణ అయిన తరువాత ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు ఇద్దరూ అవినాష్ ఇంట్లోనే గడిపారు. శివప్రకాశ్ రెడ్డి, అవినాష్ కు మొబైల్ ఫోన్ చేసి వివేకా చనిపోయారని తెలిపాడు. హత్య జరిగిన ప్రాంతంలో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ రెడ్డి చెరిపివేశారని, ఆ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ పేర్కొంది.

నిర్థారణ చేసుకునేందుకు గుగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నామని, ఆ రోజు వీరందరూ అవినాష్ ఇంట్లోనే ఉన్నారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఆధారాలు చెరిపివేసేందుకు అందరూ అవినాష్ ఇంటి నుంచి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారని తెలిపింది.

పలుమార్లు వివేకా హత్యపై ఉదయ్ రెడ్డి ని ప్రశ్నించినప్పటికీ సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నాడని, సహాయ నిరాకరణ చేశారని పేర్కొంది. విచారణకు రాకుండా పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నామని సిబిఐ వెల్లడించింది.