రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు
నేడు అఖిలపక్ష భేటీ 2024 ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ-2 ప్రభుత్వం సమర్పించే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే విధాత: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల దృష్ట్యా ఈరోజు అఖిలపక్ష సమావేశం జరగనున్నది. ఈభేటీని పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభల సమావేశాలకు సహకరించాలని కేంద్రం ఈ భేటీలో అన్నిపార్టీలకు విజ్ఞప్తి చేయనున్నది. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి నేడు ఎన్డీఏ పక్షాలు […]

- నేడు అఖిలపక్ష భేటీ
- 2024 ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ-2 ప్రభుత్వం సమర్పించే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే
విధాత: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల దృష్ట్యా ఈరోజు అఖిలపక్ష సమావేశం జరగనున్నది. ఈభేటీని పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభల సమావేశాలకు సహకరించాలని కేంద్రం ఈ భేటీలో అన్నిపార్టీలకు విజ్ఞప్తి చేయనున్నది. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి నేడు ఎన్డీఏ పక్షాలు సమావేమవుతున్నాయి.
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయి. ఆమె ప్రసంగం అనంతరం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వేను ప్రవేశపెడుతారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కానున్నది.
రెండు విడతలుగా జరగనున్నబడ్జెట్ సమావేశాల్లో మొదటి విడత రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి.