విమోచనం పేరుతో ఫెడరల్ స్పూర్తికి కేంద్రం విఘాతం: శాసన మండలి చైర్మన్ గుత్తా

విధాత, నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచనం పేరుతో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత దేశంలో విలినమై 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాటం లో అసువులు బాసిన అమరులకు జోహార్లు తెలిపారు. తెలంగాణ విలీనం ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతీయ […]

విమోచనం పేరుతో ఫెడరల్ స్పూర్తికి కేంద్రం విఘాతం: శాసన మండలి చైర్మన్ గుత్తా

విధాత, నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచనం పేరుతో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత దేశంలో విలినమై 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాటం లో అసువులు బాసిన అమరులకు జోహార్లు తెలిపారు.

తెలంగాణ విలీనం ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యత ఉత్సవాల పేరుతో నిర్వహిస్తుండగా, కేంద్రం పోటీగా విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్ లో ఉత్సవాలను నిర్వహిస్తు ఫెడరల్ వ్యవస్థ ను దెబ్బ తీసేవిధంగా వ్యవహరిస్తోందన్నారు.

కేంద్రం వైఖరి రాష్ట్రాల హక్కులను హరించేదిగా ఉందన్నారు. తెలంగాణ స్వతంత్ర పోరాటం పట్ల అవగాహన లేని వారు తెలంగాణ విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాట మాడుతున్నారన్నారు.

తెలంగాణ విలీన దినోత్సవంను రాష్ట్ర గవర్నర్ విమోచన దినోత్సవం గా జరుపుకోవాలని వ్యాఖ్యానించడం చూస్తే ఆమె గతంలో పనిచేసిన బీజేపీ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తుందని తేలిపోయిందన్నారు. రాష్ట్ర గవర్నర్ తీరు గవర్నర్ల వ్యవస్థ పట్ల గౌరవాన్ని పోగొట్టే విధంగా, రాజ్యంగా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రజలు విద్వేష భావజాలం వైపు ఆకర్షితులు కాకుండా తెలంగాణ జాతీయ సమైక్య త వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు.