మరో రూపంలో.. నల్ల చట్టాలు అమలుకు కేంద్రం యత్నం: రైతు సంఘం నేతలు

మద్దతు ధరల చట్టం తేవాలి మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. రైతులు, కౌలు రైతుల‌ను గుర్తించాలి సంప‌ద‌ సృష్టించే రైతుల విస్మ‌ర‌ణ త‌గ‌దు: రైతు సంఘం నేతలు విధాత: కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకు సిద్ధ పడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం ప్రకటించాలని, విద్యుత్ […]

  • By: krs    latest    Jan 26, 2023 11:10 AM IST
మరో రూపంలో.. నల్ల చట్టాలు అమలుకు కేంద్రం యత్నం: రైతు సంఘం నేతలు
  • మద్దతు ధరల చట్టం తేవాలి
  • మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..
  • రైతులు, కౌలు రైతుల‌ను గుర్తించాలి
  • సంప‌ద‌ సృష్టించే రైతుల విస్మ‌ర‌ణ త‌గ‌దు: రైతు సంఘం నేతలు

విధాత: కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకు సిద్ధ పడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం ప్రకటించాలని, విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేసి, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని డిమాండ్ చేసింది.

ఈ విష‌యంపై ఎస్‌కేఎం, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గురువారం నల్ల‌గొండ‌ జిల్లా కేంద్రంలో 1000 ట్రాక్టర్లకు జాతీయ జెండా పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీని ఉద్దేశించి బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నల్ల చట్టాలను మళ్లీ మరో రూపంలో తిరిగి తెస్తే వ్యవసాయ రంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారి, పారిశ్రామిక, కార్పొరే ట్‌, భూస్వామివర్గాలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తూ, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రవేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యా ల సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని, ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్‌ సంస్థలకు కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. దేశ సంపదను సృష్టించే రైతులను, కౌలు రైతులను విస్మరించడం తగదన్నారు. వ్యవసాయంపై అనుబంధ రంగాలు, చిన్న వ్యాపారులు ఆధార పడి ఉన్నారని, కేంద్రం విధానాల కారణంగా ఈ రంగాలు సంక్షోభంలోకి వెళ్లడంతో మెజార్టీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్య యంపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో రైతులు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం ఖాయమని తెలిపారు.

కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్‌రెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మహమ్మద్ సలీం, తుమ్మల పద్మ, మల్లం మహేష్, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కొండ వెంకన్న, జిల్లా అంజయ్య, భీమ గాని గణేష్, బొల్లు రవి, పుల్లెంల శ్రీకర్, దేవి రెడ్డి మల్లారెడ్డి, వెంకన్న, మధుసూదన్ రెడ్డి, లింగయ్య, చిలక రాజు భిక్షం, సీతారాం రెడ్డి, కుర్తాల భూపాల్, నరసింహ, బ్రహ్మానంద రెడ్డి, గుణాల పూరి మారయ్య తదితరులు పాల్గొన్నారు.