Bharat Rice | వచ్చే వారం నుంచే భారత్ రైస్ పంపిణీ

ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కిలో 29రూపాయలకే బియ్యం పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా సంజీవ్ చోప్రా వెల్లడించారు

  • By: Somu    latest    Feb 02, 2024 12:35 PM IST
Bharat Rice | వచ్చే వారం నుంచే భారత్ రైస్ పంపిణీ

Bharat Rice | విధాత : ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కిలో 29రూపాయలకే అందించే భారత్ రైస్ బ్రాండ్ బియ్యం పథకాన్ని వచ్చే వారం నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లుగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌(నాఫెడ్‌), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో భారత్ రైస్‌ను విక్రయించనున్నట్లుగా తెలిపారు. 5కేజీలు, 10కేజీలు బ్యాగ్‌ల చొప్పున విక్రయించనున్నట్లుగా పేర్కోన్నారు.