FCI | గోధుమలు, బియ్యం రాష్ట్రాలకు అమ్మొద్దు: ఎఫ్‌సీఐలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

రాష్ట్రాలకు అవరోధకం కల్పించడమే పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలు నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శల వెల్లువ విధాత: బహిరంగ మార్కెట్‌ అమ్మకం పథకం(ఓఎంఎస్‌ఎస్‌) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు గోధుమలు, బియ్యం అమ్మడాన్ని తక్షణమే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ (FCI) ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆహార పథకాలకు అవరోధం కలిపించడంకోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. కేంద్రం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపించింది. గోధుమలు, బియ్యం నిల్వలను […]

FCI | గోధుమలు, బియ్యం రాష్ట్రాలకు అమ్మొద్దు: ఎఫ్‌సీఐలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
  • రాష్ట్రాలకు అవరోధకం కల్పించడమే
  • పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలు
  • నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శల వెల్లువ

విధాత: బహిరంగ మార్కెట్‌ అమ్మకం పథకం(ఓఎంఎస్‌ఎస్‌) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు గోధుమలు, బియ్యం అమ్మడాన్ని తక్షణమే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ (FCI) ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆహార పథకాలకు అవరోధం కలిపించడంకోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. కేంద్రం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

గోధుమలు, బియ్యం నిల్వలను వేలం వేసి బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)ని ఆదేశించింది. పదిహేను లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులకు, బల్క్‌ కొనుగోలుదారులకు ఈ-వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం కోరింది.

బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదలను నియంత్రించడంకోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం జూన్‌ 3న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఎఫ్‌సీఐ కేంద్రం కోటా బియ్యాన్ని కూడా ప్రైవేటు వ్యాపారులకు అమ్మాలని ఈ ఆదేశాలలో పేర్కొంది. ఎఫ్‌సీఐ జూన్‌ 28 న ఈ-వేలం ప్రారంభించాలని ప్రభుత్వం ఈ ఆదేశాలలోనే పర్కొంది.

‘అన్నభాగ్య’ పథకం అమలు చేయడానికి తమకు 2.2 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాలని, అందుకు క్వింటాలుకు 3400 చెల్లిస్తామని ప్రతిపాదిస్తూ తమ ప్రభుత్వం జూన్‌ 9 న ఎఫ్‌సీఐకి లేఖ రాసిందని, ఎఫ్‌సీఐ కూడా బియ్యం సరఫరా చేయడానికి అంగీకరించిందని, ఇంతలోనే కేంద్రం తమ పథకానికి ఆటంకం కలిగించడంకోసమే జూన్‌ 13 న ఈ ఆదేశాలు జారీ చేసిందని సిద్ధరామయ్య ఆరోపించారు.

ప్ర‌జా సంక్షేమంపై ప‌డ‌గ‌

ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో గోధుమలు ఉత్పత్తి అయ్యాయి. భారతదేశంలో రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని గోడౌన్ల‌లో 270 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయి. కానీ మోడీ స‌ర్కార్‌ గోధుమలు, బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకు విక్రయించడాన్ని నిలిపివేసింది.

దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న (బీపీఎల్) కుటుంబాలన్నింటికీ నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల ఆహార ధాన్యాలు అందించే “అన్న భాగ్య” పథకాన్ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 12న గోధుమలు, బియ్యం సరఫరా చేసేందుకు ఎఫ్‌సీఐ అంగీకరించింది. జూలై 14న, కేంద్రం దీన్ని నిలిపివేసింది.

కర్ణాటకలో ఓటమికి ప్రతీకారం?

క‌ర్ణాట‌క‌లో 40 శాతం క‌మీష‌న్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి ఇటవలి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు గెలిపించ‌డాన్ని బీజేపీ నాయ‌క‌త్వం జీర్ణించుకోలేక‌పోతోంది. త‌మ‌ను వ్య‌తిరేకించే మీడియాను, రాజ‌కీయ పార్టీల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను ఎలాగైతే ఇబ్బందుల పాలు చేస్తున్నారో, ఇప్పుడు క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌ను కూడా ఆ కేట‌గిరీ కింద ఇబ్బందులు పెట్టాల‌నే పైశాచిక నిర్ణ‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

బీజేపీకి ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలు ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా పెద్ద ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం లేదు. ఇన్నాళ్లు క్రోనీ క్యాపిటలిస్టు ప్రయోజనాల కోసం ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌బెట్టిన మోదీ సార‌థ్యంలోని కేంద్రం ఇప్పుడు ప్ర‌జ‌ల‌పై క‌క్ష తీర్చుకునే

నియంత‌పోక‌డ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం మ‌నంద‌రికీ గుర్తుంది. అలాంటి ఉద్య‌మాన్ని మ‌రోసారి తీసుకురావాలి అనే విధంగా మోడీ ప్ర‌భుత్వ విధానాలు ఉంటున్నాయి. రైతు ఉద్య‌మాన్ని చ‌ల్లార్చే క్ర‌మంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితులను తొలగించడం అనేది ప్ర‌ధాన ష‌ర‌తు.
ఇందుకోసం మోదీ ప్రభుత్వం రెండేళ్లపాటు రైతులతో పోరాడింది. కానీ ఇప్పుడు, రికార్డు స్థాయిలో గోధుమ ఉత్పత్తి ఉన్నప్పటికీ, కేంద్రం గోధుమ నిల్వల‌పై పరిమితులను విధించింది! స్టాక్ పరిమితులపై ఉన్న లాజిక్‌ను మోడీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుంది? అనే ప్ర‌శ్న‌కు బిజేపీ నేత‌లుకానీ, వారి మ‌ద్ద‌తుదారులుకానీ ఏమ‌ని స‌మాధానం చెబుతారు? ఏవైనా సమాధానాలు ఉన్నాయా