Chandrababu | జైలులోనే చంద్రబాబు.. బాబు హౌస్ రిమాండ్‌పై తీర్పు వాయిదా

Chandrababu | హౌస్ రిమాండ్‌పై తీర్పు నేటికి వాయిదా కస్టడీ కోరిన సీఐడీ విధాత : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు నేటీకి వాయిదా వేశారు. చంద్రబాబు కస్టడీ కోరుతు సీఐడీ వేసిన పిటిషన్‌పైన, బాబు జైలు రిమాండ్‌ను హౌస్‌ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌పైన వాదనలు ముగియగా తీర్పును న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. బాబు […]

  • By: krs    latest    Sep 12, 2023 1:25 AM IST
Chandrababu | జైలులోనే చంద్రబాబు.. బాబు హౌస్ రిమాండ్‌పై తీర్పు వాయిదా

Chandrababu |

  • హౌస్ రిమాండ్‌పై తీర్పు నేటికి వాయిదా
  • కస్టడీ కోరిన సీఐడీ

విధాత : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు నేటీకి వాయిదా వేశారు. చంద్రబాబు కస్టడీ కోరుతు సీఐడీ వేసిన పిటిషన్‌పైన, బాబు జైలు రిమాండ్‌ను హౌస్‌ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌పైన వాదనలు ముగియగా తీర్పును న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.

బాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా, సీఐడీ తరుపు న్యాయవాది అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు పోటాపోటీగా సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆదివారం కేసు విచారణలో భాగంగా చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14రోజుల రిమాండ్‌ విధించింది.

దీనిపై మంగళవారం బాబు రిమాండ్‌ ను హస్‌ అరెస్టుగా భావించాలని లూథ్రా న్యాయవాదుల బృందం, చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ న్యాయవాదులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై వాదనలు వినిపించారు. న్యాయమూర్తి హిమబిందు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.

సీఐడీ తరుపు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తన వాదనలో చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయిలో భద్రత, ప్రత్యేక వసతులు కల్పించారని తెలిపారు. జైలు పరిసరాల్లోనూః అదనపు పోలీస్‌ భద్రత ఏరాప్టు చేశారని కోర్టుకు వివరించారు.

రాజమహేంద్రవరం జైలు గోడలు 50అడుగుల ఎత్తులో ఉన్నాయన్నారు. 24గంటలు పోలీసులు విధుల్లోనే ఉన్నారని, అత్యవసర పరిస్థితిలు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆర్ధిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశముంటుందని, అందుకే చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని కోరారు.

అటు చంద్రబాబు తరుపునా వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ద లూద్రా జైలులో చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని కోర్టుకు విన్నవించారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉన్నందునా గతం నుంచి కూడా ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగుతుందని తెలిపారు.

కేంద్రం కల్పించిన ఆ సెక్యూరిటీలో ఏపీ ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడానికి వీల్లేదన్నారు. హౌస్‌ రిమాండ్‌కు సంబంధించి తన వాదనలకు బలం చేకూర్చేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 6 తీర్పును లూథ్రా కోర్టుకు వివరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో హౌస్‌ రిమాండ్‌కు అనుమతిస్తారని కోర్టుకు తెలిపారు.