Chandrababu | బాబుకు భయమేస్తోందా..? కుప్పం కోసం భారీ కమిటీ

Chandrababu విధాత‌: రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తానని చిత్తూర్ జిల్లాకు చెందిన చంద్రబాబు ఆగర్భ రైవల్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రతినబూనడంతో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. కుప్పంలో తనకు దెబ్బ పడితే మొత్తానికేనే మోసం.. పార్టీ పునాదులే కదిలిపోతాయి అని భయపడ్డారో… జాగ్రత్త పడ్డారో తెలియదు కానీ ఇప్పట్నుంచే ఆయన అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. కుప్పంలో 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి వై నాట్ 175 అనే […]

  • Publish Date - April 28, 2023 / 07:43 AM IST

Chandrababu

విధాత‌: రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తానని చిత్తూర్ జిల్లాకు చెందిన చంద్రబాబు ఆగర్భ రైవల్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రతినబూనడంతో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. కుప్పంలో తనకు దెబ్బ పడితే మొత్తానికేనే మోసం.. పార్టీ పునాదులే కదిలిపోతాయి అని భయపడ్డారో… జాగ్రత్త పడ్డారో తెలియదు కానీ ఇప్పట్నుంచే ఆయన అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు.

కుప్పంలో 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి వై నాట్ 175 అనే నినాదంతో ఇటు జగన్ పార్టీని గ్రామస్థాయికి విస్తరిస్తూ ప్రతిచోటా తమకు బలాన్ని పోగేసుకున్నారు. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అక్కడి మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, నాలుగు జడ్పిటీసిలు, సర్పంచ్ ఇలా కీలకమైన పదవులన్నీ వైసిపి ఎగరేసుకుపోవడంతో కుప్పంలో గ్రామ స్థాయిలో పని చేసేందుకు టిడిపికి ప్రజాప్రతినిధులు లేకపోయారు.

ఇది ఇలాగె వదిలేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు 32 మందితో ఓ భారీ కమిటీని వేశారు. మొన్న జరిగిన తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కంచెర్ల శ్రీకాంత్ సారధ్యంలో కుప్పం టిడిపి ఇంచార్జ్ మునిరత్నం నాయుడు తదితరులు మొత్తం 32 మందితో ఓ భారీ కమిటీ వేశారు.

అంతే కాకుండా కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని, అక్కడే ఉంటూ ప్రజల బాగోగులు చూస్తానని చెప్పిన చంద్రబాబు అక్కడ ఇంటి కోసం స్థలాన్ని కూడా చూసారు. తరచూ కుప్పం వెళ్లి వస్తున్నారు. చూస్తుంటే కుప్పం విషయంలో బాబుకు బెంగ పట్టుకుందని, అలుసు ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నంత పనీ చేసి తనను ఓడగొడతాడని చంద్రబాబు భయపడ్డారని జనం అనుకుంటున్నారు. గతంలో కేవలం ఇంచార్జ్ మాత్రమే ఉండే కుప్పానికి ఇప్పుడు ఏకంగా ఓ పెద్ద కమిటీ వేసి పార్టీని నడిపించే బాధ్యత శ్రీకాంత్, మునిరత్నం నాయుడులకు అప్పగించారు