Chandra Babu: చంద్రబాబు పొత్తుల రాజకీయం షురూ.. MLC ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు!
Chandrababu's politics of alliances started విధాత: ఎమ్మెల్సీ(Mlc) ఎన్నికలకు రంగం సిద్ధం అయింది.. ఏఏ పార్టీలు ఎవరితో పొత్తు అన్నది తేలిపోయింది. ఎవరు ఎవరితో కలిసి చేస్తారు.. అనే దానికి ఇది ఒక ట్రయల్ రన్.. నెట్ ప్రాక్టీస్ అన్నట్లుగా ఉన్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP) జనసేన (JANASENA) కలిసి పోటీ చేయడం ఫైనల్ అయినట్లు ఉంది. అయితే బీజేపీ (BJP) కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు (Chandrababu) భావిస్తున్నారు. అయితే […]

Chandrababu’s politics of alliances started
విధాత: ఎమ్మెల్సీ(Mlc) ఎన్నికలకు రంగం సిద్ధం అయింది.. ఏఏ పార్టీలు ఎవరితో పొత్తు అన్నది తేలిపోయింది. ఎవరు ఎవరితో కలిసి చేస్తారు.. అనే దానికి ఇది ఒక ట్రయల్ రన్.. నెట్ ప్రాక్టీస్ అన్నట్లుగా ఉన్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP) జనసేన (JANASENA) కలిసి పోటీ చేయడం ఫైనల్ అయినట్లు ఉంది.
అయితే బీజేపీ (BJP) కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు (Chandrababu) భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీ, వైసీపీ (YCP) అవినీతి కుటుంబ పార్టీలని వాటితో కలిసే ప్రసక్తి లేదని తేల్చిచెబుతోంది.
ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మూడు పట్టభద్రుల స్థానాలు ఉండగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం లేదు. కేవలం పట్టభద్రుల స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాక్టీస్ మ్యాచ్ అని భావిస్తున్నారు.
దీంతో చంద్రబాబు తాము పోటీ చేస్తున్న మూడు పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీల మద్దతును కూడా ఆయన తీసుకోవాలని యోచిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతిస్తే.. తాము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తమ మద్దతు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కమ్యూనిస్టులతో పొత్తు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అంటున్నారు.