Chandrayaan-3 | జులైలో చంద్రయాన్‌-3.. ప్రకటించిన ఇస్రో చైర్మన్‌

Chandrayaan-3 | చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధంగా ఉందని, జులైలో ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ బుధవారం తెలిపారు. వచ్చే నెల 12 నుంచి 19 మధ్య ప్రయోగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత మేర 12, 13, 14 తేదీల్లో ప్రయోగం నిర్వస్తామన్నారు. అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చంద్రయాన్‌-3ని రాకెట్‌ మోసుకువెళ్తుందన్నారు. ఉపగ్రహం అనుసంధానం, రోవర్‌, ల్యాండర్‌ బిగింపు […]

Chandrayaan-3 | జులైలో చంద్రయాన్‌-3.. ప్రకటించిన ఇస్రో చైర్మన్‌

Chandrayaan-3 | చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధంగా ఉందని, జులైలో ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ బుధవారం తెలిపారు. వచ్చే నెల 12 నుంచి 19 మధ్య ప్రయోగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత మేర 12, 13, 14 తేదీల్లో ప్రయోగం నిర్వస్తామన్నారు.

అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చంద్రయాన్‌-3ని రాకెట్‌ మోసుకువెళ్తుందన్నారు. ఉపగ్రహం అనుసంధానం, రోవర్‌, ల్యాండర్‌ బిగింపు పనులు పూర్తయినట్లు చెప్పారు. అయితే, జులై 13న ప్రయోగం చేపట్టనున్నారని వస్తున్న వార్తలపై ఇస్రో చైర్మన్‌ స్పందించారు.

ప్రయోగం తేదీని చేపట్టాలో నిర్ణయించలేదని, జులై 12-19 మధ్యనే ఉంటుందని చెప్పారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే తప్ప వచ్చే 12-14 మధ్య ప్రయోగం జరుగుతుందన్నారు. ఇక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 ద్వారా ప్రయోగించనున్నారు.

చంద్రుడిపైకి వెళ్లే భారత్‌కు చెందిన అత్యంత బరువైన రాకెట్‌ కావడం విశేషం. ఇస్రో తొలిసారిగా 2008లో చంద్రయాన్‌-1 ప్రయోగం చేపట్టగా విజయవంతమైంది. తొలిసారిగా చంద్రుడి ఉపరితలంపై నీటిజాడలను గుర్తించింది 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టగా.. మిషన్‌ విఫలమైంది.

ఉపగ్రహం కక్ష్యలో విజయవంతంగా తిరుగుతున్నా.. ల్యాండర్‌ మాత్రం చంద్రుడిపై క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. గత ప్రయోగంలో ఎదురైనా లోపాలను సవరించుకొని ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధమైంది.