Chandrayaan-3 | మబ్బులు దాటాక చంద్రయాన్‌ 3 ప్రయాణం ఇలా..

Chandrayaan-3 బెంగళూరు: చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని యావత్‌దేశం ఉత్కంఠతో గమనించింది. టీవీలు, సోషల్‌మీడియాలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కౌంట్‌డౌన్‌ పూర్తి చేసుకున్న ఫ్యాట్‌బాయ్‌.. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. అయితే.. అందరికీ మబ్బుల కింద వరకూ ప్రయాణం కనిపించింది. కానీ.. మబ్బులను చీల్చుకుని పైకి వెళ్లిన తర్వాత? ఆ అపూర్వ దృశ్యాన్ని చెన్నై నుంచి ఢాకా వెళుతున్న విమానంలోని ఒక ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను ఇస్రో మెటీరియల్స్‌ రిటైర్డ్‌ […]

  • Publish Date - July 16, 2023 / 12:02 PM IST

Chandrayaan-3

బెంగళూరు: చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని యావత్‌దేశం ఉత్కంఠతో గమనించింది. టీవీలు, సోషల్‌మీడియాలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కౌంట్‌డౌన్‌ పూర్తి చేసుకున్న ఫ్యాట్‌బాయ్‌.. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. అయితే.. అందరికీ మబ్బుల కింద వరకూ ప్రయాణం కనిపించింది.

కానీ.. మబ్బులను చీల్చుకుని పైకి వెళ్లిన తర్వాత? ఆ అపూర్వ దృశ్యాన్ని చెన్నై నుంచి ఢాకా వెళుతున్న విమానంలోని ఒక ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను ఇస్రో మెటీరియల్స్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ వెంకటకృష్ణన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

విమానం నుంచి చంద్రయాన్‌-3 లాంచ్‌ అనే క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం విమానం ప్రయాణిస్తున్న ప్రాంతంలో శ్రీహరి కోట ఉన్నదని, అక్కడ జరుగుతున్న చారిత్రాత్మక ప్రయోగాన్ని చూడాలని ఫ్లైట్‌ పైలట్‌ ఎనౌన్స్‌ చేయడంతో అందరూ ఆ దృశ్యాన్ని వీక్షించారు. అందులో ఒకరు ఈ అపూర్వ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించారు.

ఈ వీడియోను పోస్ట్‌ చేయగానే లక్షల్లో వ్యూస్‌ లభించాయి. చంద్రయాన్‌ -3 ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత రాకెట్‌ నుంచి క్రాఫ్ట్‌ వేరుపడింది. ప్రస్తుతం అది భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నది. దానికి సంబంధించిన వీడియోలను సైతం ఇస్రో పోస్ట్‌ చేసింది.