Chattisgarh | కొడుకు పుట్టలేదని భార్య, ముగ్గురు బిడ్డ‌ల‌ను చంపేశాడు

Chattisgarh విధాత ప్రతినిధి: సమాజం ఆధునికత వైపు దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆడ-మగ అనే తేడాలు లేకుండా అన్నీరంగాల్లో ఆడవాల్లు ముందుంటున్నారు. కానీ మగవారి భావాలే మారలేదు. సమాజంతోపాటు మారక‌పోతే మగవారు మానసిక రోగుల‌య్యే ప్రమాదం పొంచివుంది. అటువంటి ఘటనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. బాలోద్ జిల్లాలోని దేవరీ గ్రామంలో దేశ్ రాజ్ కశ్యప్(45) త‌న భార్య మోంగరాబాయి అలాగే త‌న ముగ్గురు కూతుర్లు నివాస‌ముంటున్నారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు కుమారుడు […]

  • By: krs    latest    Aug 04, 2023 12:54 AM IST
Chattisgarh | కొడుకు పుట్టలేదని భార్య, ముగ్గురు బిడ్డ‌ల‌ను చంపేశాడు

Chattisgarh

విధాత ప్రతినిధి: సమాజం ఆధునికత వైపు దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆడ-మగ అనే తేడాలు లేకుండా అన్నీరంగాల్లో ఆడవాల్లు ముందుంటున్నారు. కానీ మగవారి భావాలే మారలేదు. సమాజంతోపాటు మారక‌పోతే మగవారు మానసిక రోగుల‌య్యే ప్రమాదం పొంచివుంది. అటువంటి ఘటనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. బాలోద్ జిల్లాలోని దేవరీ గ్రామంలో దేశ్ రాజ్ కశ్యప్(45) త‌న భార్య మోంగరాబాయి అలాగే త‌న ముగ్గురు కూతుర్లు నివాస‌ముంటున్నారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు కుమారుడు లేడ‌ని తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోనౌతున్నారు. దీంతో క‌శ్య‌ప్‌కు కుటుంబ స‌భ్యులు మాన‌సిక వైద్యుల వ‌ద్ద చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గురువారం ఉద‌యం దేశ్ రాజ్ కశ్యప్‌ను ఆయ‌న బామ్మ‌ర్ది చంద‌న్ సింగ్ చికిత్స కోసం బిలాస్ పూర్ మెంటల్ హాస్పటల్ కు తీసుకవెళ్ళారు. చికిత్స పూర్తి చేసుకొని సాయంకాలానికి క‌శ్య‌ప్‌ని త‌న ఇంటి వ‌ద్ద వ‌దిలి చంద‌న్ సింగ్ వెళ్లిపోయాడు.

అర్థ‌రాత్రి దాటాక నిద్రిస్తున్న తన భార్య మోంగరాబాయి(40) పై పారతో దాడి చేసి చంపి, ఆ తరువాత పెద్దబిడ్డ కళ్యాణి (16) , రెండ‌వ బిడ్డ భాగ్యలక్ష్మి(10), చిన్నబిడ్డ యాచన(6) లను కిరాత‌కంగా చంపాడు. అనంత‌రం ఇంటి నుంచి ప‌రార‌య్యాడు. తెల్లారి విష‌యం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

పంతోరా-కోర్బీ రోడ్డు పై వున్న మందిర్ లో నిందితుడు దేశ్ రాజ్ ఉండ‌గా అరెస్టు చేశారు. విచార‌ణ‌లో దేశ్ రాజ్ క‌శ్య‌ప్ గ‌త ప‌దేళ్ల‌గా సైకోసిస్ అనే మాన‌సిక వ్యాదితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు. అంతేకాదు దేశ్ రాజ్ కొడుకు పుట్టలేదనే నిరాశతో తరచుగా డిప్రేషన్ కు గురవుతూవుండేవాడని పోలీసులు తెలిపారు. ఓ వైపు ట్రీట్ మెంట్ తీసుకొంటూనే ఇటువంటి ఘాతుకానికి పాల్పడుతాడని అస్స‌లు ఊహించ‌లేద‌ని త‌మ బంధువులు వాపోయారు.