అంబులెన్స్‌లో 364 కిలోల గంజాయి సీజ్
అత్యవసర వాహనమైన అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు

- ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘటన
విధాత: అత్యవసర వాహనమైన అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ పోలీసులు ఆమనక పోలీస్ స్టేషన్ పరిధిలో అంబులెన్స్‌ను అడ్డుకొని తనిఖీ చేయగా, 364 కిలోల గంజాయి (సైకోట్రోపిక్ డ్రగ్స్) లభించింది. బుధవారం అర్థరాత్రి, పోలీసు బృందం అనుమానాస్పదంగా వెళ్తున్నఅంబులెన్స్‌ను అడ్డగించి తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయిని లభించినట్టు ఆజాద్ చౌక్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ గుర్జార్ తెలిపారు.
గంజాయి విలువ సుమారు రూ. 36 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఒకరిని అరెస్టు చేశామని, నిందితుడిని సారన్‌గఢ్-బిలాయిగఢ్ జిల్లాకు చెందిన సూరజ్ ఖుటే (22)గా గుర్తించినట్టు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని సేకరించి బలోడా బజార్‌కు తీసుకెళ్లినట్టు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సిటీ ఎస్పీ వెల్లడించారు.