ముద్దులతో టీచర్‌కు చిన్నారి క్షమాపణలు..! (Video) వైరల్

విధాత‌: తరగతిలో చిన్నారులను అల్లరి చేయొద్దన్నా వినరు.. అది వారి హక్కుగా చెలరేగిపోతు ఉంటారు. అయితే.. అల్లరి చేస్తున్నావంటూ బాధ పడిన టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ బాలుడు ఆమెకు సారీ చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. 'ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్' అంటూ టీచర్ […]

ముద్దులతో టీచర్‌కు చిన్నారి క్షమాపణలు..! (Video) వైరల్

విధాత‌: తరగతిలో చిన్నారులను అల్లరి చేయొద్దన్నా వినరు.. అది వారి హక్కుగా చెలరేగిపోతు ఉంటారు. అయితే.. అల్లరి చేస్తున్నావంటూ బాధ పడిన టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ బాలుడు ఆమెకు సారీ చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది.

ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. ‘ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్’ అంటూ టీచర్ ఆ బాల విద్యార్థి తీరుపై నొచ్చుకుంది. ‘ఇకపై నీతో మాట్లాడబోను’ అన్నది.

దీనికి ఆ బాలుడు.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయనంటూ అలిగిన టీచర్‌ను బతిమిలాడే ప్రయత్నం చేశాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దు ముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్ సంతోషించి అయితే ముద్దు పెట్టమని అడగగా ఆ టీచర్ రెండు చెంపల పైనా ఆ చిన్నోడు ముద్దు పెట్టాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్ల ఆదరిస్తుండటంతో ఈ క్లిప్పింగ్ ను ఇప్పటికే 3.32లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్ చేశారు. ‘వీడియో ఎంతో ముద్దుగా ఉంది’, ‘మా రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.