విధాత: తమిళనాట సంగీత దర్శకునిగా కెరీర్‌ని ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఇప్పుడు హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉన్నారు.
ఈయన చిత్రాలు తమిళంలోనే కాదు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డాక్టర్ సలీం, నకిలి, బిచ్చగాడు వంటి చిత్రాలతో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా క్రేజ్ వచ్చింది. ఇక్కడ ఆయనకంటూ కొందరు అభిమానులు సైతం ఉన్నారు. ఆయన చిత్రాలకు ఇక్కడ మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి.
విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు సీక్వెల్ షూటింగ్ మలేసియాలో జరుగుతుండగా ఓ యాక్షన్ సిక్వెన్స్ లో.తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విజయ్ ప్రయాణిస్తున్న పడవ కెమెరాతో పాటు ఉన్న మరో పడవను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో వెంటనే ఆయనను కౌలాలంపూర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
విజయ్ ఆంటోనీ ఆరోగ్యం బాగా క్షీణించింది. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని కూడా పుకార్లు షికారు చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదు అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది.
ఇప్పుడు స్వయంగా ట్విట్టర్ ద్వారా విజయ్ ఆంటోనీ తన ఆరోగ్యం విషయంపై క్లారిటీ ఇచ్చారు. థంబ్‌ను చూపిస్తూ తన ఆరోగ్యం బాగానే ఉందని ఇటీవలే ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. అతి త్వరలోనే మీతో నేను మాట్లాడుతాను అని విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు. షూటింగ్‌లో త్వరలో జాయిన్ అవుతున్నట్టు తెలిపారు.
మీడియాలో విజయ్ ఆంటోని ప్రమాదం గురించి వార్తలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆంటోని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఫాతిమా క్లారిటీ ఇవ్వడం.. ఇప్పుడు స్వయంగా విజయ్ ఆంటోనీ తన ఆరోగ్యం బాగానే ఉందని స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia.
I just completed a major surgery.
I will talk to you all as soon as possible