CM Jagan | ఓసోస్ ఇంతేనా..? జగన్- ఎమ్మెల్యేల సమావేశంలో సంచలనాలేం లేవు

విధాత‌: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. కేబినెట్‌లో మార్పులు.. కొత్త వారికీ అవకాశాలు, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్ణింగులు, తలంటడాలు.హెచ్చరికలు ఉంటాయని భావించారు. ఆమ్మో చాన్నాళ్ల తరువాత, అది కూడా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన తరువాత జరిగిన సభ కాబట్టి కాస్త గట్టిగ వాడిగా వేడిగా ఉంటుందనుకున్నారు. కానీ ఏమీ లేకుండా.. అందర్నీ పేరుపేరునా పలకరించి చాయ్ సమోసాతో సరిపెట్టి భరోసా ఇచ్చి పంపేసారట జగన్. ఆగస్ట్ […]

  • By: Somu    latest    Apr 03, 2023 10:02 AM IST
CM Jagan | ఓసోస్ ఇంతేనా..? జగన్- ఎమ్మెల్యేల సమావేశంలో సంచలనాలేం లేవు

విధాత‌: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. కేబినెట్‌లో మార్పులు.. కొత్త వారికీ అవకాశాలు, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్ణింగులు, తలంటడాలు.హెచ్చరికలు ఉంటాయని భావించారు.

ఆమ్మో చాన్నాళ్ల తరువాత, అది కూడా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన తరువాత జరిగిన సభ కాబట్టి కాస్త గట్టిగ వాడిగా వేడిగా ఉంటుందనుకున్నారు.

కానీ ఏమీ లేకుండా.. అందర్నీ పేరుపేరునా పలకరించి చాయ్ సమోసాతో సరిపెట్టి భరోసా ఇచ్చి పంపేసారట జగన్. ఆగస్ట్ లోపు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి గడపకూ వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి గురించి వివరించాలని జగన్ ఆదేశించారు.

ఇంకా తానూ యాభై అరవై మందికి టికెట్స్ ఇవ్వను అని ఫిక్స్ అయినట్లుగా ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని, వాటిని నమ్మవద్దని చెబుతూ తాను ఎవర్నీ వదులుకోవాలని అనుకోవడం లేదని భరోసా ఇచ్చారు.

వీటన్నింటికన్నా ముందుగా.. ఎన్నికల గురించి క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం అంతే 2024 ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయి తప్ప ముందస్తుగా ఎన్నికలకు పోవడం లేదని స్పష్టం చేసారు.

ప్రతి లబ్దిదారుడిని తమ ప్రచారకర్తగా మార్చుకోవాలని సూచించారు. ఎప్పట్లానే తానూ దిష్ట మీడియాతో పోరాటం చేస్తున్నట్లు జగన్ చెప్పుకున్నారు.

ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు జగన్ భేటీకి డుమ్మా కొట్టారు.. చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, మంత్రులు బుగ్గన, ధర్మాన ప్రసాదరావు, ఆళ్ళ నాని, కోడలి నాని వంటి వాళ్ళు ఈ సమావేశానికి హాజరు కాలేదు.