బెడ్ మీదే కేసీఆర్‌.. ఇంటికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

తుంటి మార్పిడి ఆపరేషన్ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్‌.జగన్ గురువారం పరామర్శించారు.

  • Publish Date - January 4, 2024 / 07:52 AM IST
  • రెండేళ్ల తర్వాతా లోటస్ పాండ్‌కు జగన్‌


విధాత : తుంటి మార్పిడి ఆపరేషన్ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్‌.జగన్ గురువారం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన జగన్‌కు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్‌, జగన్‌లు సుమారు గంటకుపైగా ఏకాంతంగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు.


కాగా.. వారి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా కేసీఆర్‌తో లంచ్ తర్వాతా జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్‌కు వెళ్లిన జగన్ తన తల్లి విజయమ్మను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబంలో తలెత్తిన పరిణామాలు..చెల్లి షర్మిల కాంగ్రెస్‌లో చేరిక వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.