CM KCR | సంగారెడ్డి – హయత్‌నగర్‌ మెట్రో.. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కట్టిస్తాం: CM KCR

CM KCR ఇక్కడ ఐటీ కంపెనీలు తెప్పిస్తాం అభివృద్ధిలో దూసుకుపోతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన విధాత : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్‌కు మెట్రో రైలును మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ముందుకు దూసుకెళ్తున్నదని […]

  • Publish Date - June 22, 2023 / 03:52 PM IST

CM KCR

  • ఇక్కడ ఐటీ కంపెనీలు తెప్పిస్తాం
  • అభివృద్ధిలో దూసుకుపోతున్నది
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
  • సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

విధాత : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్‌కు మెట్రో రైలును మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ముందుకు దూసుకెళ్తున్నదని ప్రశంసించారు.

మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడి వరకు మెట్రోరైలు రావాలని కోరారని చెబుతూ.. ‘మెట్రోరైల్‌ సంగారెడ్డికి రావాలంటున్నారు. తప్పనిసరిగా రావాలి. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారు. అక్కడే ఆ సభలోనే నేను చెప్పాను. హైదరాబాద్‌ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్‌ ఉండే కారిడార్‌ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌. పటాన్‌చెరువు నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరావాల్సి ఉంది.

మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుంది. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్‌ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నాను’ అని చెప్పారు.

ఐటీ కంపెనీలు వచ్చే ఏర్పాట్లు..

పటాన్‌ చెరులో పరిశ్రమలు బాగా నడుస్తున్నయని సీఎం చెప్పారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు. త్వరలోనే ఐటీ మంత్రి కేటీఆర్‌ను పటాన్‌చెరుకు పంపిస్తానని, ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చేలా చూస్తానని తెలిపారు. మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ చైర్మన్‌గా ఉన్నారని, ఈ ప్రాంతంలో పొల్యూషన్‌ రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ సూపర్‌ స్పెషల్‌ హాస్పిటల్ వచ్చేలా చొరవ చూపారని ప్రశంసించారు.