CM KCR | తెలంగాణ ఘన కీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు.. కలెక్టర్లకు రూ. 105 కోట్లు: సీఎం కేసీఆర్

CM KCR | విధాత: తెలంగాణ ఘనకీర్తిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణ ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ మధ్యాహ్న భోజనం అనతరం రెండవ సెషన్ నడువనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, […]

  • By: krs    latest    May 25, 2023 9:37 AM IST
CM KCR | తెలంగాణ ఘన కీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు.. కలెక్టర్లకు రూ. 105 కోట్లు: సీఎం కేసీఆర్

CM KCR |

విధాత: తెలంగాణ ఘనకీర్తిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణ ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ మధ్యాహ్న భోజనం అనతరం రెండవ సెషన్ నడువనున్నది.

ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మొదటి సెషన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా అభివృద్ది చెందిందన్నారు.

పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు.