కేసీఆర్ ఓ చచ్చిన పాము: సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచకపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయగా... రేవంత్ రెడ్డి కల్పించుకుని మాట్లాడారు

కేసీఆర్ ఓ చచ్చిన పాము: సీఎం రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీ నుంచి బీఆరెస్ సభ్యుల వాకౌట్‌


విధాత: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచకపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయగా… రేవంత్ రెడ్డి కల్పించుకుని మాట్లాడారు. సీఎంపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో కేసీఅర్ వాడిన భాషపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు.


ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా… మీ బుద్ధి మారలేదన్నారు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్నారు. చచ్చిపోయిన పామును ఎవరు చంపుతారన్నారు. కేసీఆర్ అనే పాము మొన్న ఎన్నికల్లో చనిపోయిందన్నారు. కేసీఆర్ సభకు వస్తే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు.


సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్, హరీష్ రావుకు పెత్తనం ఇస్తాం.. మేడిగడ్డలో నీరు నింపి.. అన్నారం, సుందిళ్లకు ఎత్తిపోసే బాధ్యతను అప్పగిస్తామన్నారు. మేడిగడ్డ కుంగిపోయి కుప్పకూలుతుంటే నీరు నింపటం ఎలా సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం మొత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజాదనం వృథా అయిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ శాసనసభకు రాకుండా పారిపోయాడన్నారు. ఫ్రతిపక్ష నేత వస్తే రేపు సాయంత్రం వరకైనా చర్చిస్తామన్నారు.


బీఆరెస్ వాకౌట్‌


అసెంబ్లీ నుంచి బీఆరెస్ సభ్యులు వాకౌట్ చేశారు. బడ్జెట్ పై బీఆరెస్ సభ్యులు కడియం శ్రీహరి మాట్లాడిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనను శ్రీహరి నీవు హోం మంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదంటు కించపరిచారని, ఆయన డిప్యూటీ సీఎం రాజయ్యను తొలగించి డిప్యూటీ సీఎం అయ్యారని, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య టికెట్ లాగేసుకుని ఎమ్మెల్యే అయ్యి రాజ్యను మోసం చేశారంటూ విమర్శించారు. కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూర్చోమంటూ అభ్యంతరకరంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు.


కేటీఆర్ స్పందిస్తూ రాజగోపాల్‌రెడ్డి మా సభ్యుడు కడియంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే రికార్డుల నుంచి స్పీకర్ తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే తనపై కడియం చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తానేమి తప్పుడుగా మాట్లాడలేదంటూ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు పట్టిన చీడ అంటూ వ్యాఖ్యానించారు.


సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పట్ల ఉపయోగించే భాషా సరిగా లేదన్నారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి భాష ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. అటు రాజగోపాల్‌రెడ్డి సైతం బీఆరెస్‌పై తన విమర్శల దాడి కొనసాగించారు. దీంతో సీఎం, రాజగోపాల్‌రెడ్డిల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆరెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే పెళ్లిళ్లకు హాజరయ్యేందుకే బీఆరెస్ సభ్యులు సభను వాకౌట్ చేశారని కాంగ్రెస్ సభ్యులు చురకలేశారు.