మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి… అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు

విధాత: కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితి పై అధికారులు అడిగి తెలుసుకున్నారు.
CM Revanth Reddy Review on Irrigation
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సాగునీటి పారుదల అధికారులతో సమీక్ష.
— హాజరైన నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు.Review with irrigation officials at Telangana Chief Minister Revanth Reddy’s residence.
–… pic.twitter.com/OYFxC1TPyQ— Congress for Telangana (@Congress4TS) December 17, 2023
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు