Viral Video | మహిళను చూసి పడగవిప్పి.. బుసలు కట్టిన కింగ్ కోబ్రా..!
Viral Video | ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియో వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా పాముకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. భారీ కింగ్ కోబ్రా ఎన్‌క్లోజర్‌లో ఉన్నది. ఓ మహిళ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను చేతితో తాకగానే కోబ్రా ఒక్కసారిగా పడగవిప్పి పైకి లేచి కాటు వేసేందుకు ప్రయత్నించింది. గ్లాస్ ఎన్‌క్లోజర్ ఉండడంతో పాము ప్రయత్నం విఫలమైంది. కొద్దిసేపు మహిళ అలాగే […]

Viral Video | ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియో వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా పాముకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. భారీ కింగ్ కోబ్రా ఎన్‌క్లోజర్‌లో ఉన్నది.
ఓ మహిళ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను చేతితో తాకగానే కోబ్రా ఒక్కసారిగా పడగవిప్పి పైకి లేచి కాటు వేసేందుకు ప్రయత్నించింది. గ్లాస్ ఎన్‌క్లోజర్ ఉండడంతో పాము ప్రయత్నం విఫలమైంది. కొద్దిసేపు మహిళ అలాగే ఎన్‌క్లోజర్‌ను తాకుతూనే ఉండగా.. పాము నా ఇంటినే తాకుతావా ? అన్నంత కోపంతో కాటువేసేందుకు సర్వ ప్రయత్నాలు చేసింది.
చివరకు తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ వీడియోను స్నేక్ వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతున్నది. గత వారం కింద వీడియోను పోస్ట్ చేయగా దాదాపు 5లక్షలకుపై వ్యూస్ వచ్చాయి. 2వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన కొందరు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఫూలిష్ కోబ్రా అని ఒకరు కామెంట్ చేయగా.. పాపం కోబ్రా అని మరొకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ మనుషులు చిరాకు కలిగించే వ్యక్తులని, తెలివి తక్కువ వారంటూ మండిపడ్డాడు. పాముకు, వ్యక్తికి మధ్య గ్లాస్ ఉండకూడదని తాను అనుకుంటున్నానని.. పిరికితనంతో గ్లాస్ వెనుక ఉన్నారని, తీసేందుకు ధైర్యం చేయలేరని.. కాబట్టి పాముతో ఆటలాడడం మానేయాలని హితవు పలికాడు.