కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజలతోనే: చాడ వెంకటరెడ్డి
వార్షికోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ విధాత, వరంగల్: వ్యవస్థ మార్పు కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీ మరో మైలురాయికి చేరుకుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ 98 వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాదాపు తొమ్మిదిన్నర దశాబ్దాల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎన్నో […]

వార్షికోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ
విధాత, వరంగల్: వ్యవస్థ మార్పు కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీ మరో మైలురాయికి చేరుకుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ 98 వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
దాదాపు తొమ్మిదిన్నర దశాబ్దాల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎన్నో వందల మంది కార్యకర్తలు, నాయకులు తమ త్యాగమయ జీవితాలతో పార్టీని పురోభివృద్ధి చేశారని కొనియాడారు. అమరవీరుల వారసత్వం, ప్రజల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ ముందు భాగంలో నిలబడాలని పిలుపునిచ్చారు.
సీపీఐ వార్షికోత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా పార్టీ అధ్వర్యంలో సోమవారం హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు సీపీఐ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పురుషులు ఎర్ర అంగీలు, మహిళా కార్యకర్తలు ఎర్ర చీరలు ధరించి ఈ ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి భిక్షపతి జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.