భార్యపై అనుమానం.. బస్సులోనే కండక్టర్‌ను హత్య చేసిన భర్త
Wife Murder | ఆమె వృత్తిరీత్యా కండక్టర్. రోజుకు 8 గంటలు పని. పొద్దున్నే విధులకు వెళ్తే.. సాయంత్రానికి ఇంటికి వచ్చేది. అయితే భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భావించాడు. ఆమె విధుల్లో ఉండగానే కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్ జిల్లాకు చెందిన అమృత్ రథావాకు మంగుబెన్‌కు కొన్నేండ్ల క్రితం […]

Wife Murder | ఆమె వృత్తిరీత్యా కండక్టర్. రోజుకు 8 గంటలు పని. పొద్దున్నే విధులకు వెళ్తే.. సాయంత్రానికి ఇంటికి వచ్చేది. అయితే భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భావించాడు. ఆమె విధుల్లో ఉండగానే కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్ జిల్లాకు చెందిన అమృత్ రథావాకు మంగుబెన్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. మంగుబెన్ వృత్తిరీత్యా కండక్టర్. ఆమె గుజరాత్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తుంది. విధుల నిమిత్తం ఆమె పొద్దున్నే వెళ్లిపోయేది.
అనుమానంతో బస్సులోనే చంపేశాడు..
తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ అంశంపై పలుమార్లు భార్యతో గొడవ పెట్టుకున్నాడు. చివరకు మంగళవారం రోజు ఆమెను చంపేశాడు. భార్య విధులు నిర్వర్తిస్తున్న బస్సులోనే 200 కిలోమీటర్లు ప్రయాణించి, కత్తితో పొడిచి చంపాడు. అనంతరం భార్య మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.