Congress
విధాత: కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, స్టార్ కంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రోజంతా చేరికల కార్యక్రమాలు జరిగాయి. బుధవారం ఉదయం పలు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల నివాసాలకు వెళ్లిన రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డితో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సలహాలు, సూచనలపై నాయకులు సుదీర్ఘ మంతనాలు జరిపారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల.కిరణ్ కుమార్ రెడ్డి, శివసేనరెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఫేహీం ఖురేషి, చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.