శ్రీన‌గ‌ర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించిన రాహుల్ గాంధీ

శ్రీనగర్ : భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 సంవత్సరంలో శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రాంతంలోనే ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపి రాహుల్ గాంధీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకా వాద్రా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎ.రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఇవాళ ఉదయం పంథ చౌక్ నుంచి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక వాద్రాతో కలిసి […]

శ్రీన‌గ‌ర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించిన రాహుల్ గాంధీ

శ్రీనగర్ : భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 సంవత్సరంలో శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రాంతంలోనే ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపి రాహుల్ గాంధీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకా వాద్రా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎ.రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

ఇవాళ ఉదయం పంథ చౌక్ నుంచి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక వాద్రాతో కలిసి భారత్ జోడో యాత్ర కొనసాగించారు. రాహుల్ టీ షర్ట్ ధరించగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు భారత్ జోడోయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని జనవరి 30వ తేదీన శ్రీనగర్ లోని పిసిసి కార్యాలయంలో ఆవిష్కరించాలని అనుకున్నామని, శ్రీనగర్ ప్రభుత్వ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ రోజే ఎగురవేశారు. ముగింపు యాత్ర కావడంతో భద్రతా బలగాలు శనివారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వారాంతపు సంతలను నిలిపివేసి సెక్యురిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల మీదుగా భారత్ జోడో యాత్ర 135 రోజుల పాటు (4080 కిలోమీటర్లు) కొనసాగించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు.